ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అభివృద్ధి సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

ABN, Publish Date - Jun 16 , 2025 | 11:59 PM

అభివృద్ధి, సంక్షేమమే కాం గ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సోమవా రం నిట్టూరు, తుర్కలమద్దికుంట గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ, ఇళ్ళకు ముగ్గుపోసే కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

పెద్దపల్లి రూరల్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమమే కాం గ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సోమవా రం నిట్టూరు, తుర్కలమద్దికుంట గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ, ఇళ్ళకు ముగ్గుపోసే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులం దరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతోపాటు పెద్దపల్లి నియోజక వర్గంలో 3500 ఇండ్లు మంజూరు చేశామని, అదనంగా 1000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రజలను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. నిరుపేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేశామన్నారు. గత ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారుల పేర్లు మార్చకుండా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లకు వసతులు కల్పించి అందించామన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఈర్ల స్వరూప, ఎంపీవో శరత్‌బాబు, మల్లయ్య, మాజీ జడ్పీటీసీ రామ్మూర్తి, రాజేందర్‌, నాయకులు నరేష్‌, ఎడెల్లి శంకర్‌, ప్రదీప్‌, సంపత్‌రావు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతోపాటు, మెరుగైన విద్యాబోఽ దన అందిస్తున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. తుర్కలమద్ది కుంట ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే చిన్నారులతో ఓనమాలు దిద్దించారు. అనంతరం పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయురాలు మంజులత, సీఆర్‌పీ సుధాకర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భూ భారతి ద్వారా పెం డింగ్‌ సమస్యలు పరిష్కారమవుతాయని ఎమ్మెల్యే అన్నారు. రెవెన్యూ సదస్సులో మాట్లాడారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి ద్వారా రైతుల భూములు ఆన్‌లైన్‌ కానరాకుండా పోయాయని, భూ భారతి ద్వారా ప్రతీ ఒక్కరి భూమిని ఆన్‌లైన్‌ ద్వారా ప్రదర్శించే విధంగా తీసుకొచ్చినట్లు తెలి పారు. డిప్యూటీ తహసీల్దార్‌ విజేందర్‌, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 11:59 PM