స్థానిక ఎన్నికల్లో కాషాయం జెండా ఎగురవేయాలి
ABN, Publish Date - Jun 26 , 2025 | 11:57 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవే యాలని, కార్పొరేషన్‌లో బీజేపీ బలంగా ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి అన్నారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ అన్ని డివిజన్లలో బీజేపీకి పోటీ చేసే సత్తాఉందని, అత్యధికంగా సీట్లు కైవసం చేసుకుంటుందన్నారు.
గోదావరిఖని, జూన్ 26(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవే యాలని, కార్పొరేషన్‌లో బీజేపీ బలంగా ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి అన్నారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ అన్ని డివిజన్లలో బీజేపీకి పోటీ చేసే సత్తాఉందని, అత్యధికంగా సీట్లు కైవసం చేసుకుంటుందన్నారు. మోదీ ప్రధాని అయిన తరువాత రామగుండం ప్రాంతానికి ఎరువుల కర్మాగారం, విద్యుత్ ప్లాంట్ విస్తరణ, కార్పొరేషన్‌కు అమృత్ పథకం కింద నిధులు విడుదలతోపాటు చిరు వ్యాపారులకు రుణాలను అందించిందన్నారు. శ్మశాన వాటికలో కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గోదావరిఖనిలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతాయని, దీనిపై సింగరేణి యాజ మాన్యం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. రాజీవ్ యువ వికాసం పేరుతో కాంగ్రెస్ ప్రభు త్వం కొత్త నాటకానికి తెరలేపిందన్నారు. నాయకులు కందుల సంధ్యారాణి, మేరుగు హన్మంతుగౌడ్, కోమళ్ల మహేష్, భాస్కర్‌రెడ్డి, మూకిరి రాజు, కొండపర్తి సంజీవ్, కోడూరి రమేష్, గుండబోయిన భూమయ్య, మచ్చ విశ్వాస్ పాల్గొన్నారు.
Updated Date - Jun 26 , 2025 | 11:57 PM