27న గ్రామాల్లో గులాబీ జెండా రెపరెపలాడాలి
ABN, Publish Date - Apr 16 , 2025 | 11:52 PM
వరంగల్ ఈనెల 27న నిర్వహించే బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభ సం దర్భంగా గ్రామ గ్రామాన గులాబీ జెండా రెపరెపలాడా లని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ మంథని నియో జకవర్గ ఇంచార్జి పుట్ట మధు పిలుపునిచ్చారు. బుధ వారం ఆయన నివాసంలో డివిజన్‌లోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్ మండలాల్లోని బీఆర్ ఎస్ పార్టీ ముఖ్యనేతలతో సన్నాహాక సమావేశాన్ని నిర్వ హించి సభ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
మంథని, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): వరంగల్ ఈనెల 27న నిర్వహించే బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభ సం దర్భంగా గ్రామ గ్రామాన గులాబీ జెండా రెపరెపలాడా లని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ మంథని నియో జకవర్గ ఇంచార్జి పుట్ట మధు పిలుపునిచ్చారు. బుధ వారం ఆయన నివాసంలో డివిజన్‌లోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్ మండలాల్లోని బీఆర్ ఎస్ పార్టీ ముఖ్యనేతలతో సన్నాహాక సమావేశాన్ని నిర్వ హించి సభ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ గొప్ప ఆశయం కోసం ఆవిర్భవించి రాష్ర్టాన్ని సాధించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలు నుంచి పాలన పరమైన నిర్ణయాలకు అభాసుపాలవుతుందని విమర్శించారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపు లకు గురి చేస్తే సహించేది లేదన్నారు. తగరం శంకర్ లాల్, మాచీడి రాజుగౌడ్, పొతిపెద్ది కిషన్‌రెడ్డి, కనవేన శ్రీనివాస్, పూదరి సత్యనారాయణగౌడ్, శంకేషి రవీందర్, కుమార్‌లు పాల్గొన్నారు.
కోల్‌సిటీ, (ఆంధ్రజ్యోతి): వరంగల్‌లో జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవాలను విజయవంతం చేయాలని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ అన్నారు. రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ధర్మారం, (ఆంధ్రజ్యోతి) వరంగలో జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావాలని మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పూస్కూరి జితేందర్‌రావు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పోస్టర్లను ఆవిష్కరించారు. పూస్కూరి రామారావు, కాంపెల్లి చంద్ర శేఖర్, తుమ్మల రాంబాబు, కూరపాటి శ్రీనివాస్, ఎండీ రఫీ, సల్వాజీ మధవరావు, ఆవుల లత, దేవి లావణ్య, వనిత, మోకనపల్లి రాజమ్మ, నర్సయ్య, పాల్గొన్నారు.
జ్యోతినగర్, (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందన్ అన్నారు. వరంగల్‌లో జరిగే పార్టీ రజోత్సవ సభకు సంబంధించి బుధవారం ఎన్టీపీసీ బీఆర్‌ఎస్ పట్టణ కమిటీ సమావేశ మైంది. చందర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన గులాబీ జెండాతోనే సాధ్యమైందన్నారు. అధికా రం కోల్పోయినప్పటికీ బీఆర్‌ఎస్ ప్రజల వెంట ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నదన్నారు. బీఆర్‌ఎస్, కేసీఆర్ మాత్రమే ప్రజలకు శ్రీరామరక్ష అని అన్నారు. నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు సభకు తరలి రావాలని కోరారు. బుర్ర శంకర్‌గౌడ్, కౌశిక హరి, మాజీ కార్పొరేటర్లు రమణారెడ్డి, శ్రీనివాస్, కృష్ణవేణి పాల్గొన్నారు. 27న గ్రామాల్లో గులాబీ జెండా రెపరెపలాడాలి
Updated Date - Apr 16 , 2025 | 11:52 PM