అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN, Publish Date - Jun 20 , 2025 | 12:33 AM
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తెలంగాణా ప్రభుత్వ ధ్యేయమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాగూర్ అన్నారు. గురువారం ఆయా గ్రామాలకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు, కొత్త రేషన్ కార్డులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు.
అంతర్గాం, జూన్ 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తెలంగాణా ప్రభుత్వ ధ్యేయమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాగూర్ అన్నారు. గురువారం ఆయా గ్రామాలకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు, కొత్త రేషన్ కార్డులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పాటు ప్రజలను వంచించి పాలించిందే కానీ ఇళ్లులేని పేదలకు సొంతింటి కలను నెరవేర్చలేదని ఆరోపించారు.
సీఎం రేవం త్‌రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిర మ్మ ఇండ్లను మంజూరు చేయడంతో పాటు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ప్రభు త్వం చేయని విధంగా రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణ మాఫీ చేసి ఎలాంటి కోతలు లేకుండా చివరి గింజ వరకు మద్దతు ధర ఇచ్చి ధాన్యాన్ని కొను గోలు చేసిందని తెలిపారు. అంతర్గాంలో 33కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆర్‌డీఓ గంగయ్య, తహసీల్దార్ తూము రవీందర్ పటేల్, ఎంపీడీఓ వేణు మాధవ్, సీఐ ప్రవీణ్ కుమార్, నాయకులు మడ్డి తిరుపతి గౌడ్, రాజలింగం, పెండ్యాల మహేష్, హనుమాన్‌రెడ్డి, సింగం కిరణ్ గౌడ్, ఆవుల గోపాల్ యాదవ్, నాజీయా సుల్తానా, పాల్గొన్నారు.
Updated Date - Jun 20 , 2025 | 12:33 AM