ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలి
ABN, Publish Date - May 28 , 2025 | 11:54 PM
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని ఉద్యమ కారుల ఫోరం జిల్లా అధ్య క్షుడు గుండేటి ఐలయ్య యాదవ్ కోరారు. బుధ వారం పట్టణంలో ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.
పెద్దపల్లిటౌన్, మే 28 (ఆంఽధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని ఉద్యమ కారుల ఫోరం జిల్లా అధ్య క్షుడు గుండేటి ఐలయ్య యాదవ్ కోరారు. బుధ వారం పట్టణంలో ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం నందన గార్డెన్లో ఉద్యమకారులను ఘనంగా సన్మా నించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గల్లీ నుంచి ఢిల్లీ దాక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తమ జీవితాలను త్యాగం చేశామని, రాష్ట్రం వస్తే తమ బతుకులు మారుతాయని ఆశించామని, కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమిస్తే తమను మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఉద్యమకారులమంతా కాంగ్రెస్ వెంట ఉన్నామని, పార్టీ గెలుపునకు కృషి చేశామని తెలిపారు.
జూన్ 2న స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని ఉద్యమకారులను ఏకం చేసి ఐక్యతతో ముందుకు సాగుతున్నామని, భవిష్య త్తులో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవం, సంక్షేమానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పనిచేస్తుందన్నారు. పార్టీలో, సంక్షేమ పథకాలలో ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్, గోపగాని సారయ్య గౌడ్, నల్ల మనోహర్ రెడ్డి, నూనె రాజేశం, జ్యోతి, చంద్రకళ, సురేందర్ రెడ్డి, భాస్కర్, సదాశివ, రాజిరెడ్డి, రాజు, కృష్ణ, సదయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 30 , 2025 | 03:10 PM