రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వం
ABN, Publish Date - May 06 , 2025 | 12:11 AM
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడు తుండని ఎమ్మెల్యే చింతకుంట విజయరమ ణారావు అన్నారు. కూనారం వ్యవసాయ పరి శోధన స్థానం ప్రొఫెసర్ జయశంకర్ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో ఉషన్నపల్లె గ్రామం లో సోమవారం రైతుల ముంగిట్లో శాస్త్ర వేత్తలు కార్యక్రమం నిర్వహించారు.
కాల్వశ్రీరాంపూర్, మే 5 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడు తుండని ఎమ్మెల్యే చింతకుంట విజయరమ ణారావు అన్నారు. కూనారం వ్యవసాయ పరి శోధన స్థానం ప్రొఫెసర్ జయశంకర్ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో ఉషన్నపల్లె గ్రామం లో సోమవారం రైతుల ముంగిట్లో శాస్త్ర వేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో అన్ని రకాల పం టలు కూరగాయలు పండిస్తారన్నారు. శాస్త్ర వేత్తలు సూచించిన విషయాలను రైతులు పాటించాలన్నారు. సేంద్రియ ఎరువులు వాడితే రైతులకు రోగాలు దరిచేరవు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీతో పాటు బోనస్, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో 75 శా తం మంది రైతులకు రుణమాఫీ జరిగింద న్నారు. సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్ నాయకులు ఫేక్ వీడియోలు పెడుతున్నార న్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా ఎవ రికి రుణమాఫీ కాలేదన్నారు. ఏ రాష్ట్రంలో ఇవ్వని సన్న బియ్యం సీఎం రేవంత్ రెడ్డి ఇస్తున్నారన్నారు. త్వరలో రేషన్ కార్డులు కూడా ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ప్రభు త్వం నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తే ఉషన్నపల్లె ప్రత్యేక గ్రామపంచాయతీ అవుతుందని హామీ ఇచ్చారు. జిల్లా వ్యవ సాయ అధికారి ఆదిరెడ్డి, మాజీ ఎంపీపీ గోప గోని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, శాస్త్రవేత్తలు శ్రీధర్, మధుకర్ రావు, హార్టికల్చర్ అధికారి సురేష్, వెటర్నరీ డాక్టర్ సురేష్, ఏవో నాగార్జున, రైతులు పాల్గొన్నారు.
రసాయనిక ఎరువులతో
భూసారం తగ్గుతుంది
రసాయనిక ఎరువులతో భూసారం తగ్గు తుందని శాస్త్రవేత్త మధుకర్ రావు అన్నారు. రైతులకు ఆయన అవగాహన కల్పించారు. వరి పంటతోపాటు ప్రత్యా మ్నాయ పంటలు వెయాలన్నారు. ప్రభుత్వం పచ్చి రొట్టెకు సబ్సిడీ ఇస్తుందన్నారు. రైతులు భూమి బలంగా ఉండాలంటే సేంద్రియ ఎరువులను ఎక్కువగా వాడాలన్నారు.
Updated Date - May 06 , 2025 | 12:11 AM