రైతులను ఆదుకొంటున్న ప్రభుత్వం
ABN, Publish Date - Jun 18 , 2025 | 12:02 AM
రైతులను అన్ని విధాల ఆదుకుంటున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దం పేట, లక్ష్మీపూర్, ఆరేపల్లి, మల్యాల, మీర్జంపేట గ్రామాలలో పలు అభి వృద్ధి పనులకు ప్రారంభోత్సాలు చేశారు. మీర్జంపేటలో 13లక్షల దాతల సహాయంతో నిర్మించిన రామాలయం షెడ్డును ప్రారంభించారు. పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, ప్రహరీ పనులకు శంకుస్థాపనలు చేశారు. అనం తరం ఆయాగ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అంద జేశారు. ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోశారు.
కాల్వశ్రీరాంపూర్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): రైతులను అన్ని విధాల ఆదుకుంటున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దం పేట, లక్ష్మీపూర్, ఆరేపల్లి, మల్యాల, మీర్జంపేట గ్రామాలలో పలు అభి వృద్ధి పనులకు ప్రారంభోత్సాలు చేశారు. మీర్జంపేటలో 13లక్షల దాతల సహాయంతో నిర్మించిన రామాలయం షెడ్డును ప్రారంభించారు. పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, ప్రహరీ పనులకు శంకుస్థాపనలు చేశారు. అనం తరం ఆయాగ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అంద జేశారు. ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోశారు. ఆయా గ్రామాల్లో ఏర్పా టుచేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలం పెట్టుబడి సాయం 9రోజులలో రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఎంత భూమి ఉన్న రైతుభరోసా పడుతుందన్నారు.
ఇప్పటికే రెండు ఎకరాల వరకు రైతు లకు ఎకరాకు రూ.6 వేల చొప్పున అందజేశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుభరోసాతోపాటు, రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం వలన రైతులకు లాభం కలుగుతుందన్నారు. సన్న వడ్లకు బోనస్ ఇవ్వ డంతో సీడ్ కంపెనీలు కూడా రైతులకు లాభం చేస్తున్నాయన్నారు. ఆయకట్టు చివరి భూములకు నీరందించి పంటలను కాపాడామన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక, మట్టి మాఫియా జోరుగా జరిగిందని, ప్రస్తు తం ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వారికి ట్రాక్టర్ల ద్వారా తీసుకుపోయేం దుకు వెసలుబాటు కల్పించామన్నారు. ఇటుక బట్టీల యజమానులు కలెక్టర్ సూచించిన మేరకు లారీకి రూ.2700 చెల్లించి మట్టి తీసుకు పోతున్నారన్నారు. మట్టి తరలింపులో తాను అవినీతికి పాల్పడలేదని మీర్జంపేట రామాలయంలోని దేవుని సాక్షిగా చెప్పుతున్నానన్నారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేవారికి ఇటుక తక్కువ ధరకు ఇవ్వాలని బట్టీల యజమానులకు సూచించానన్నారు. మీర్జంపేట సమ్మక్కసారలమ్మ జాతర రోడ్డుకు బీటీ రోడ్డు వేయిస్తానన్నారు. రైతులు పంటమార్పిడి చేసి అధిక లాభాలు పొందాలన్నారు. మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ చదు వు రామచంద్రారెడ్డి, మాజీ జడ్పీటీసీలు లంక సదయ్య, తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు సదయ్య, ఎంపీడీవో పూర్ణచందర్ పాల్గొన్నారు.
Updated Date - Jun 18 , 2025 | 12:02 AM