రామగుండాన్ని సుందరంగా తీర్చిదిద్దమే లక్ష్యం
ABN, Publish Date - May 17 , 2025 | 11:57 PM
రామగుం డం నగరాన్ని సుందర నగరంగా తీర్చిది ద్దమే లక్ష్యమని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ చెప్పారు. శనివారం రాత్రి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.50.5లక్షలతో దుర్గానగర్‌తోపాటు ఏడు చోట్ల నిర్వహించే పార్కుల అభివృద్ధి పనులకు ఆయన శంకు స్థాపన చేశారు.
కోల్‌సిటీ, మే 17(ఆంధ్రజ్యోతి): రామగుం డం నగరాన్ని సుందర నగరంగా తీర్చిది ద్దమే లక్ష్యమని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ చెప్పారు. శనివారం రాత్రి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.50.5లక్షలతో దుర్గానగర్‌తోపాటు ఏడు చోట్ల నిర్వహించే పార్కుల అభివృద్ధి పనులకు ఆయన శంకు స్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రజలకు ఆరోగ్య మైన వాతావరణం కల్పించేందుకు పార్కులు ఎంతో అవసరమని, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టు కుని డివిజన్లలో మరిన్ని పార్కు లను అందుబాటులోకి తీసుకురాను న్నట్టు చెప్పారు. తిలక్‌నగర్‌లో సిం గరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్కును ప్రజ లకు అందు బాటులోకి తీసుకువచ్చినట్టు చెప్పారు. కమిషనర్ అరుణశ్రీ మాట్లాడుతూ ప్రజలకు అనువైన వాతావరణం అందించేం దుకు పార్కులను అభివృద్ధి చేస్తున్నట్టు తెలి పారు. నాయకులు బొంతల రాజేష్, మహం కాళి స్వామి, గుంపుల తిరుపతి, పొలసాని శ్రీనివాస్, దాసరి సాంబమూర్తి, ఉమ, ఈఈ రామన్ పాల్గొన్నారు.
Updated Date - May 17 , 2025 | 11:57 PM