స్కిల్ డెవలప్‌మెంట్‌తోనే విద్యార్థులకు భవిష్యత్
ABN, Publish Date - May 08 , 2025 | 11:32 PM
సాంకేతిక విద్యలో స్కిల్ డెవలప్‌మెంట్‌తోనే విద్యా ర్థులకు భవిష్యత్‌కు బాటాలు పడుతాయని జేఎన్టీయూ యూనివర్సిటి వైస్ చాన్సలర్ కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం రాత్రి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల(మంథని)లో నిర్వహించిన కళాశాల వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.
రామగిరి, మే 8(ఆంధ్రజ్యోతి): సాంకేతిక విద్యలో స్కిల్ డెవలప్‌మెంట్‌తోనే విద్యా ర్థులకు భవిష్యత్‌కు బాటాలు పడుతాయని జేఎన్టీయూ యూనివర్సిటి వైస్ చాన్సలర్ కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం రాత్రి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల(మంథని)లో నిర్వహించిన కళాశాల వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మంత్రి శ్రీధర్‌బాబు చొరవతో యూనివర్సిటి టిసిఎల్‌తో ఒప్పందం చేసుకుందని పేర్కొన్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం కల్గిన ప్రతీ విద్యార్థికి నైపుణ్యత శిక్షణ కల్పిస్తామని తెలిపారు. ఉద్యోగ అవ కాశాలను కల్పించేందుకు కృషి చేస్తామని, అందుకు అనుగుణంగా ప్లేస్‌మెంట్స్ ఏర్పా టు చేస్తామని పేర్కొన్నారు. ఇంగ్లీష్‌పై మరింత నైపుణ్యం పెంచుకోవాలని విద్యార్థులకు తెలిపారు. అనంతరం ఇంజనీరింగ్‌లో టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులకు గోల్డ్‌మోడల్స్, క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృ తిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రామగుండం ఏరియా క్వాలిటీ జీఎం బైద్య, ప్రిన్సి పాల్ విష్ణువర్థన్, వైస్ ప్రిన్స్‌పాల్ ఉదయ్‌కుమార్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో వార్షికోత్సవం
పెద్దపల్లి కల్చరల్, (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ఆధునిక సాంకేతికవైపు అడుగులు వేయాలని ట్రినిటీ ఎడ్యుకేషన్ ఇన్సిట్యూషన్స్ వ్యవస్థాపకులు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. పెద్దపల్లిలో గురువారం ట్రినిటీ ఇంజనీరింగ్ క ళాశాల వార్షికో త్సవానికి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల 2008లో స్థాపించిన నాటినుండి ఎన్నో విజయాలు సాధిస్తూ కళాశాల న్యాక్ అక్రిడేషన్ పొందిందన్నారు. ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివే విధంగా కృషిచేయాలని, నిరంతర తపనతో ముందుకు గాసాలని ఆయన పేర్కొన్నారు. బీటెక్ ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అంద జేశారు. విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి. అకాడ మిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్‌కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ మణిగణేషన్, హెచ్‌ఓడీలు డాక్టర్ నటరాజ్, ప్రభాకర్, స్వాతి, హెచ్‌ఓడి పద్మిని, హెచ్‌ఓడి డాక్టర్ ఆరీఫ్, ఏవో సురేష్, రాజిరెడ్డి, చొప్పరి వంశీ, పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
Updated Date - May 08 , 2025 | 11:33 PM