ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజాపాలనలో సాకారవమవుతున్న సొంతింటి కల

ABN, Publish Date - May 30 , 2025 | 11:45 PM

ప్రజాపాలనలో పేదల సొంతింటి కల నెరవేరుతోందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శుక్రవా రం లాలపల్లి, ఎలిగేడు, ర్యాకల్‌దేవ్‌పల్లి, రాములపల్లి గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి పనులకు భూమి పూజచేసి ఇం దిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ముగ్గు పోసి మంజూరు పత్రాలు అందజేశారు.

ఎలిగేడు, మే 30 (ఆంధ్రజ్యోతి) : ప్రజాపాలనలో పేదల సొంతింటి కల నెరవేరుతోందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శుక్రవా రం లాలపల్లి, ఎలిగేడు, ర్యాకల్‌దేవ్‌పల్లి, రాములపల్లి గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి పనులకు భూమి పూజచేసి ఇం దిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ముగ్గు పోసి మంజూరు పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ హయాంలో పేదలను మోసం చేసి ప్రజాధనాన్ని దోచుకున్నారన్నారు. ఎలిగేడు నుంచి లాలపల్లి వరకు రూ.3 కోట్లు,లాలపల్లి నుంచి చీమలపేట వరకు బీటీరోడ్డు పూర్తిచేసుకొన్నామన్నారు. ఎలిగేడు మండల కేంద్రంలో సిమెంట్‌ రోడ్డు, డ్రైనేజీల కోసం రూ.1కోటి నిధులు వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు. ఎలిగేడు బైపాస్‌ నుంచి సుల్తాన్‌పూర్‌ వరకు రోడ్డు నిర్మాణ పనులు సాగుతున్నాయన్నారు. ఎలిగేడులో త్వరలో పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభం అవుతుందన్నారు. మండలంలో రైతులకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. తహసీ ల్దార్‌ యాకన్న, ఎంపీడీవో భాస్కర్‌రావు, కాంగ్రెస్‌ మండల అఽధ్యక్షుడు సామ రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు దుగ్యాల సంతోష్‌రావు, కోరుకంటి వెంకటేశ్వర్‌రావు, రాజనర్సు, బూర్ల సత్యం, తాటిపల్లి రమేష్‌బాబు, మారం మల్లేశం, పీటర్‌, అంజయ్య, వెంకట్‌రెడ్డి, బాలసాని పర్శరాంగౌడ్‌, పాల్గొన్నారు.

జూలపల్లి, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వం పేదప్రజలకు అందిస్తున్న సం క్షేమ పథకాల అమలులో ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. నాగులపల్లి, చీమలపేట, తెలుకుంట గ్రామాల్లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన, ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించి ఇండ్లకు ముగ్గులు పోశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గండు సంజీవ్‌, విండో చైర్మెన్‌ పుల్లూరి వేనుగోపాల్‌రావు, మాజీ జడ్పిటిసి బొద్దుల లక్ష్మినర్సయ్య, మాజీ సర్పంచ్‌ నర్సింహాయాదవ్‌, నాయకులు బొజ్జ శ్రీనివాస్‌, బండి స్వామి రాగల్ల రవి, పలువురు పాల్గొన్నారు.

............................................................................................................................

Updated Date - May 30 , 2025 | 11:45 PM