ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠ్యాంశాలను బోధించాలి

ABN, Publish Date - Jul 09 , 2025 | 12:16 AM

ఆయా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు అర్థం అయ్యేవిధంగా పాఠ్యాంశాలను బోధించాలని రాష్ట్ర ఇంటర్మీడియట్‌ ప్రత్యేకాధికారి, పరిశీలకులు రమణారావు అధ్యాపకులకు సూచించారు. మంగళవారం సుల్తానాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను సందర్శించారు.

సుల్తానాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ఆయా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు అర్థం అయ్యేవిధంగా పాఠ్యాంశాలను బోధించాలని రాష్ట్ర ఇంటర్మీడియట్‌ ప్రత్యేకాధికారి, పరిశీలకులు రమణారావు అధ్యాపకులకు సూచించారు. మంగళవారం సుల్తానాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను సందర్శించారు. రాష్టంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెంచడం, డ్రాప్‌ అవుట్లను తగ్గించేందుకు ఆకడమిక్‌ మానిటరింగ్‌ చేయడానికి ఇంటర్మీడియట్‌ కమిషనర్‌ రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలకులను నియమించారని ఇందులో భాగంగా తాను జిల్లాల్లో పర్యటిస్తూ కళాశాలలను పరిశీలిస్తున్నట్లు వివరించారు. జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి కల్పన, ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకులతో సుల్తానాబాద్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర పరిశీలకులు రమణారావు ఆయా కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య, వసతులు, ఇతర అంశాలను చర్చించారు. విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడానికి, డ్రాప్‌ అవుట్స్‌ను తగ్గించుకోవడానికి నాణ్యమైన విద్య అందించాలన్నారు. జిల్లా అధికారి కల్పన మాట్లాడుతు ఆడ్మిషన్ల పెంపులో అధ్యాపకులు, ప్రిన్సిపాల్స్‌ కృషిని అభినందిస్తూ గడువు లోగా మరిన్ని అడ్మిషన్లకు కృషి చేయాలని సూచించారు.

విద్యార్థులు ఆసక్తితో నేర్చుకునేలా బోధించాలి

ధర్మారం, (ఆంధ్రజ్యోతి): కళాశాల విద్యార్థులు ఆసక్తితో నేర్చుకునేలా పాఠ్యాంశాలు బోధించాలని ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ పరిశీలకులు ఉడిత్యాల రమణారావు అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను మంగళవారం సందర్శించారు. ప్రైవేటు కళాశాలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ల పెరుగుదలకు అధ్యాపకులు కృషిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మట్లాడుతూ శ్రద్ధతో చదివితే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి ఇంటర్‌ బోర్డు డైరెక్టర్‌ కృష్ణ ఆదిత్య కృషి చేస్తున్నారన్నారు. ఐఐటి, జేఈఈ, నీట్‌, ఆప్‌సెట్‌, క్లాట్‌ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడానికి ఫిజిక్స్‌ వాలా, ఖాన్‌ అకాడమీ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకొని ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రిన్స్‌పాల్‌ డి.అనంతరామకృష్ణ, అధ్యాపకులు ఉన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 12:16 AM