వార్డెన్ నిర్లక్ష్యంపై విద్యార్థుల రాస్తారోకో
ABN, Publish Date - Jul 24 , 2025 | 11:54 PM
స్థానిక ఎస్సీ కాలేజ్ స్టూడెంట్ మేనేజ్‌మెంట్ హాస్టల్ వార్డెన్ సాధుల రమేష్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నాడని, టిఫిన్, భోజనం విషయంలో ఇబ్బందులకు గురి చేయటాన్ని నిరసిస్తూ విద్యా ర్థులు అంబేద్కర్ చౌక్‌లో గురువారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
మంథని, జూలై 24 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎస్సీ కాలేజ్ స్టూడెంట్ మేనేజ్‌మెంట్ హాస్టల్ వార్డెన్ సాధుల రమేష్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నాడని, టిఫిన్, భోజనం విషయంలో ఇబ్బందులకు గురి చేయటాన్ని నిరసిస్తూ విద్యా ర్థులు అంబేద్కర్ చౌక్‌లో గురువారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
రోడ్డుపై బైఠాయించి వార్డెన్, ఎఎస్‌డబ్ల్యూవోలకు వ్యతిరేకంగా నినా దాలు చేశారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృ ష్టికి తీసుకెళ్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విమరించారు. జిల్లా సంక్షేమాధికారి వినోద్‌కుమార్ హాస్టల్ తనిఖీ చేశారు. విద్యార్థు లను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వార్డెన్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహించాలని సూచించారు. సమస్యలపై కలె క్టర్, కమిషనర్‌లకు నివేదిస్తానని తెలిపారు.
Updated Date - Jul 24 , 2025 | 11:54 PM