ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి

ABN, Publish Date - Jun 22 , 2025 | 12:30 AM

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా కోరారు. శనివారం ఎన్టీపీసీ పీటీఎస్‌లోని కేంద్రీయ విద్యాలయంలో యాంటీ డ్రగ్స్‌ అవగాహన వారోత్సవాలలో భాగంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.

జ్యోతినగర్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా కోరారు. శనివారం ఎన్టీపీసీ పీటీఎస్‌లోని కేంద్రీయ విద్యాలయంలో యాంటీ డ్రగ్స్‌ అవగాహన వారోత్సవాలలో భాగంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థులు గంజాయి, డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాలకు బానిస కావద్ద న్నారు. డ్రగ్స్‌ అలవాటుగా మారితే వారి జీవితాలు నాశనం అవుతా యన్నారు. తెలంగాణాను డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని, విద్యార్థు లను చైతన్యవంతుల్ని చేసేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టామని సీపీ తెలిపారు. గంజాయి, డ్రగ్స్‌ సరఫరా, విక్రయం, సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యాంటీ డ్రగ్స్‌ పోస్టర్లను సీపీ, విద్యార్థులు, పోలీసులు ఆవిష్కరించారు. మత్తు పదార్థాలకు దూరం గా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. యోగా డే సందర్భంగా సీపీ విద్యార్థుతో కలిసి యోగా సాధన చేశారు. ఎస్‌బీ ఏసీపీలు ఎం.రమేష్‌, మల్లారెడ్డి, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్‌ శోభన్‌ బాబు, సీఐలు ప్రవీణ్‌కుమార్‌, ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌, పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2025 | 12:30 AM