ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలి

ABN, Publish Date - Jul 03 , 2025 | 12:22 AM

విద్యార్థులకు గుణాత్మక విద్యను అందిం చేందుకు పటిష్ట చర్యలు తీసుకొంటున్నామని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం జడ్పీ ఉన్నత పాఠశాల, సుల్తాన్‌పూర్‌లో పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు.

ఎలిగేడు, జూలై 2 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు గుణాత్మక విద్యను అందిం చేందుకు పటిష్ట చర్యలు తీసుకొంటున్నామని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం జడ్పీ ఉన్నత పాఠశాల, సుల్తాన్‌పూర్‌లో పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. సుల్తాన్‌పూర్‌లో మాజీ సర్పంచ్‌, స్వాతంత్య్ర సమరయోధుడు తానిపర్తి కాంతారావు జ్ఞాపకార్థం వారి కుమారులు పాఠశాలకు రూ.5 లక్షల విలువ గల ఎలక్ర్టిక్‌ ఆటోను అందించారు.

1977-78 బ్యాచ్‌ 7వ తరగతి విద్యా ర్థులు రూ.2.16 లక్షల విలువగల డైనింగ్‌ టేబుల్‌ సెట్‌ను అందజేశారు. అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా రూ.9 లక్షలు నిధులు వెచ్చించి శిథిలావస్థలో ఉన్న డైనింగ్‌ హాల్‌ మరమ్మతు, రూ.5 లక్షలతో అంతర్గత రోడ్డు, గేటు ఏర్పాటు పనులను పరి శీలించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు సైకిళ్లు అందించేందుకు ప్రతిపాదనలు అందించాలని తెలిపారు. పాఠశాలకు దాతలు కిచెన్‌ షెడ్డుకు అవసరమైన 9 డైనింగ్‌ టేబుళ్లు, 18 బెంచీలను కలెక్టర్‌ పంపిణీ చేశారు. విద్యా లయాల్లో సరైన బోధన అందించేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. తహసీల్దార్‌ యాకన్న, ఎంపీడీవో భాస్కర్‌రావు, ఎంఈవో, హెచ్‌ఎంలు అనసూరి నరేంద్రచారి, గండ్ర దేవెందర్‌ రావు, సంతోష్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌లు అర్షనపల్లి వెంకటేశ్వర్‌రావు, తిరుపతి, సీఆర్పీ లక్ష్మినారాయణ, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 12:22 AM