న్యాయ వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన ఉండాలి
ABN, Publish Date - Jul 27 , 2025 | 12:00 AM
న్యాయ వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన ఉండాలని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, గోదా వరిఖని జిల్లా అదనపు జడ్జి డాక్టర్ టి.శ్రీనివాస రావు అన్నారు. శనివారం విశ్వభారతి పాఠశాల లో లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సుకు అదనపు జడ్జి శ్రీనివాస్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జ్యోతినగర్, జూలై 26 (ఆంధ్రజ్యోతి) : న్యాయ వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన ఉండాలని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, గోదా వరిఖని జిల్లా అదనపు జడ్జి డాక్టర్ టి.శ్రీనివాస రావు అన్నారు. శనివారం విశ్వభారతి పాఠశాల లో లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సుకు అదనపు జడ్జి శ్రీనివాస్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జడ్జి ప్రసంగిస్తూ న్యాయ స్థానాల వల్ల ప్రయోజనాలు, అందించే సేవలపై విద్యార్థులకు అవగాహన ఉం డాలన్నారు. లా అండ్ ఆర్డర్, చట్టాలు, నేరాలు, కోర్టు విధులు, కోర్టుల ద్వారా పొందే సహాయం, సేవలపై జడ్జి విద్యార్థులకు వివరించారు.
లీగల్ సర్వీసె్‌స్ బాఽధితులు, కక్షిదారులకు చేయూతనం దిస్తుందని తెలిపారు. విశ్వభారతిలోని కార్యా లయాన్ని జడ్జి శ్రీనివాసరావు ప్రారంభించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీష్, బార్ అసోసియేషన్ కమిటీ ప్రతినిధులు మహ మ్మద్ ఉమర్, ముచ్చ కుర్తి కుమార్, వరలక్ష్మి, గ్లోరి, విశ్వభారతి విద్యాసంస్థల చైర్మన్ బందారపు యాదగిరిగౌడ్, హెచ్‌ఎం తిరుపతిగౌడ్, ప్రిన్సి పాల్ ప్రవీణ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - Jul 27 , 2025 | 12:00 AM