ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆధునిక సాంకేతికతపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి

ABN, Publish Date - Jul 05 , 2025 | 11:33 PM

ఆధునిక సాంకేతికతపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. శనివారం మంథని పట్టణంలో పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు.

మంథని, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ఆధునిక సాంకేతికతపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. శనివారం మంథని పట్టణంలో పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన మెరుగైన విద్య అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేసిందన్నారు. ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ క్లాస్‌ రూంలను సీఎస్‌ఆర్‌ నిధులతో ఏర్పాటు చేస్తామన్నారు. రోబోటిక్స్‌, డ్రైవర్‌ లెస్‌ కార్ల వంటి సాంకేతిక అంశాలు విద్యార్థులకు నేర్పాలన్నారు. ఏఐ టూల్స్‌పై విద్యార్థులు అవగాహన కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తుందన్నారు. టీచర్స్‌కు కూడా ఏఐ బోధనపై శిక్షణ ఇస్తామన్నారు.

స్పోకెన్‌ ఇంగ్లీష్‌ స్కిల్స్‌ నేర్పించడా నికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పాత్రికేయులు కృషి చేయాలన్నారు. ఈనెల 16న గంగపుత్ర సంఘం ఆధ్వ ర్యంలో నిర్వహించే గంగాదేవి బోనాల జాతర పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. జూనియర్‌ కళాశాల గ్రౌండ్‌లో సింథటిక్‌ టెన్నిస్‌ కోర్టు, చిల్డ్రన్స్‌ పార్కు, ఆర్సీ కట్ట ఆధు నికీకరణ పనులు, అయ్యాగారి చెరువులు, గంగాపురి వద్ద సబ్‌స్టేషన్‌ పనులకు శంకుస్థాపనతోపాటు బోయి నిపేట ఏకో పార్కు వద్ద చిల్డన్‌ పార్కును ప్రారంభిం చారు. రామగిరి, ముత్తారం, మంథని, కమాన్‌పూర్‌ మండలాల ప్రభుత్వ పాఠశాలలకు సీఎస్‌ఆర్‌ కింద మంజూరైన డ్యూయల్‌ డెస్క్‌, కుర్చీలను జెడ్పీహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాలలో పంపిణీ చేశారు. సీడ్స్‌ ఎన్‌జీవో ద్వారా నిర్మించిన డిజిటల్‌ క్లాస్‌లను, లైబ్రరీని ప్రారం భించారు. పోచమ్మవాడలో పాల కేంద్రం వద్ద ప్రభుత్వం, ఉషా ఇంటర్నేషనల్‌ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మహిళా కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్‌స్టోర్‌ సందర్శిం చారు. సీతారామ సేవా సదన్‌ సౌజన్యంతో ఏర్పాటు చేసిన గ్యాస్‌ ఆధారిత జ్వాలన యంత్రాన్ని ప్రారంభిం చారు. మంథని ప్రెస్‌క్లబ్‌ను సందర్శించారు. కార్యక్రమా ల్లో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్యగౌడ్‌, ఆర్డీవో సురేష్‌, శ్రీసీతారామ సేవా సదన్‌ వ్యవస్థాపకులు నారాయణ గురూజీ, అధ్యక్షుడు కేవీఎల్‌ఎన్‌ హరిబాబు, కాంగ్రెస్‌ నేతలు శశిభూషన్‌కాచే, వొడ్నాల శ్రీనివాస్‌, కొత్త శ్రీనివాస్‌, ఉప్పట్ల శ్రీనివాస్‌, ఐలి ప్రసాద్‌, సతీష్‌, సెగ్గెం రాజేష్‌, ముస్కుల సురేందర్‌రెడ్డి, మూల సరోజనలు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 11:33 PM