రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు
ABN, Publish Date - May 02 , 2025 | 11:34 PM
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో డీసీపీ కరుణాకర్‌తో కలిసి రోడ్డు ప్రమాదాల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రమాణాలపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ సూచిం చారు.
పెద్దపల్లిటౌన్, మే 2 (ఆంఽధ్రజ్యోతి) జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో డీసీపీ కరుణాకర్‌తో కలిసి రోడ్డు ప్రమాదాల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రమాణాలపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ సూచిం చారు. జిల్లాలో అధికంగా ట్రాఫిక్ ఉండే జంక్షన్ల వద్ద అవ సరమైన జాగ్రత్తలు చేపట్టాలన్నారు. పాఠశాల వద్ద స్కూల్ జోన్ బోర్డులు ఉండాలని, పెద్దపల్లిలోని కూనారం జంక్షన్, కమాన్ జంక్షన్, బస్‌స్టాండ్, మంథని ఫ్లైఓవర్ వద్ద రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలన్నారు. జంక్షన్‌లో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని, అవసరమైన లైటింగ్ సౌక ర్యం కల్పించాలని, జంక్షన్ల కంటే ముందు ఇరు వైపులా అవసర మైన బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
లారీలు, ట్రాక్టర్‌లు, భారీ వాహనాలు, కార్లకు ముందు వెనుక తప్పని సరిగా రేడియం స్టిక్కర్లు ఉండాలని, రాజీవ్ రహదారి పై అవ సరమైన చోట పోలీస్, ఆర్టీవో అధికారుల సమక్షంలో రబ్బర్ స్ట్రీప్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. రహదారిపై టర్నింగ్ వద్ద రేడియం స్టిక్కర్లతో బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకంపై విస్తృత ప్రచారం కల్పించాలని, బ్లాక్ స్పాట్స్ వద్ద స్పీడ్ లిమిట్ బోర్డులను, యాక్సిడెంట్ ఏరియాలో స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో ఆర్‌అండ్‌బి ఈఈ భావ్‌సింగ్, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, ఏసీపీలు రమేష్, కృష్ణ, కలెక్టరేట్ పర్యవేక్షకులు బండి ప్రకాష్, ట్రాఫిక్ సిఐ, ఎస్‌ఐలు, పాల్గొన్నారు.
Updated Date - May 02 , 2025 | 11:34 PM