రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
ABN, Publish Date - May 28 , 2025 | 12:11 AM
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, అందుకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ డి.వేణు అధికారులను ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
పెద్దపల్లి కల్చరల్, మే 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, అందుకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ డి.వేణు అధికారులను ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వేడుకలు కలెక్టరేట్‌లో జరుగుతాయని, జిల్లాలోని ప్రతీ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు. ప్లాగ్, గ్రౌండ్ ఏర్పాట్లు పోలీస్, రెవెన్యూశాఖ అధికారులు సమన్వయంతో పూర్తిచేయాలన్నారు. వేదిక సీటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తిచేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్య శిబిరం, తాగునీరు ఏర్పాటు చేయాలని, ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వాన పత్రి కలు అందించాలన్నారు. పట్టణంలోని స్వశక్తి మహిళ సంఘాల ప్రతినిధులు హాజరయ్యేలా మెప్మా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్య అతిథి గౌరవ వందనం, బందోబస్తు ఏర్పాటు పకడ్బందీగా చేయాలన్నారు. డీసీపీ కరుణాకర్, ఏసీపీ జి.కృష్ణ, ఆర్డీవో గంగయ్య, కలెక్టరేట్ సివిభాగం సూపరింటెండెంట్ ప్రకాష్, అధికారులు, పాల్గొన్నారు.
మీసేవ కేంద్రాలను
నిబంధనల ప్రకారం నిర్వహించాలి
పెద్దపల్లిటౌన్, మే 27 (ఆంధ్రజ్యోతి): నిబంధనల ప్రకారం మీసేవ కేంద్రాలను నిర్వహించాలని అదనపు కలెక్టర్ డీ వేణు పేర్కొన్నారు. మంగళ వారం కలెక్టరేట్‌లో మీసేవా కేంద్రాల నిర్వహణపై అధికారులు, మీసేవా కేం ద్రాల ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడు తూ ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం కేంద్రాలలో అవసరమైన పెయిం టింగ్, సేవలను వివరించేలా నోటీస్ బోర్డు వివరాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇతర ముఖ్యమైన పత్రాల జారీలో ఫిర్యాదులు రావద్దన్నారు. మీసేవ కేంద్రాల నిర్వహణపై ఆపరేటర్లు అప్రమత్తంగా ఉండాలని, ఫిర్యాదులు వస్తే తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు తనిఖీ నిర్వహించవచ్చని సూచించారు. మీసేవ కేంద్రంలో ప్రతీ సర్వీసుకు ఎంత చెల్లించాలి, ఎన్ని రోజులలో సర్టిఫికెట్ జారీ అవుతుందో వివరాలతో సిటిజెన్ చార్టర్ ఏర్పాటు చేయాలన్నారు. మీ సేవా కేంద్రాలకు వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని, సిటిజన్ చార్టర్‌లో పేర్కొన్న మేరకు మాత్రమే నగదు తీసుకోవాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈడిఎం కవిత, మీసేవా జిల్లా మేనేజర్ విద్యాసాగర్, పాల్గొన్నారు.
Updated Date - May 28 , 2025 | 12:11 AM