ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి

ABN, Publish Date - May 12 , 2025 | 11:52 PM

ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్‌ డి.వేణు అన్నారు. సోమవారం పెద్దకల్వల, మూలసాల గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు వివరాలు, అందుబాటులో ఉన్న టార్ఫాలిన్‌ కవర్లు, గన్ని బ్యాగులు, కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలింపు తదితర వివరాలను తెలుసుకున్నారు.

పెద్దపల్లి రూరల్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్‌ డి.వేణు అన్నారు. సోమవారం పెద్దకల్వల, మూలసాల గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు వివరాలు, అందుబాటులో ఉన్న టార్ఫాలిన్‌ కవర్లు, గన్ని బ్యాగులు, కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలింపు తదితర వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం 17 తేమ శాతం రాగానే కాంటా వేసి మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యానికి సంబంధించిన మద్దతు ధర, సన్న రకం ధాన్యానికి బోనస్‌ డబ్బులు రైతులకు సకాలంలో జమ అయ్యేలా చూడాలని సూచించారు.

జిల్లాలో ఇప్పటివరకు 438 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసి 304 కోట్ల చెల్లింపులు చేశామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. వాహనాల కొరత, హమాలీల సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తనిఖీల్లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2025 | 11:52 PM