స్కూల్ బస్సులపై స్పెషల్ డ్రైవ్
ABN, Publish Date - Jun 17 , 2025 | 11:58 PM
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం స్కూల్ బస్సులపై రవాణాశాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎంవీఐ సంతోష్‌రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు. ఎఫ్‌సీ ఐ గౌతమినగర్ జంక్షన్‌లో పరిమితిని మించి విద్యార్థులను తీసుకెళతున్నట్టు ఆర్‌ఎఫ్‌సీఎల్‌లోని శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన ఒక బస్సును సీజ్ చేశారు.
కోల్‌సిటీ, జూన్ 17(ఆంధ్రజ్యోతి): రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం స్కూల్ బస్సులపై రవాణాశాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎంవీఐ సంతోష్‌రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు. ఎఫ్‌సీ ఐ గౌతమినగర్ జంక్షన్‌లో పరిమితిని మించి విద్యార్థులను తీసుకెళతున్నట్టు ఆర్‌ఎఫ్‌సీఎల్‌లోని శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన ఒక బస్సును సీజ్ చేశారు. ఈ నెల 12న రవాణాశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రెండు బస్సులను సీజ్ చేశా రు. గోదావరిఖని, ఎన్‌టీపీసీ, యైుటింక్లయిన్‌కాలనీ ప్రాంతాల్లో మొత్తం 81స్కూల్ బస్సులు ఉండగా ఇప్పటికీ 70బస్సులకు ఫిట్ నెస్ చేశారు. మరో ఆరు బస్సులు ఫిట్‌నెస్‌కు పెట్టినట్టు ఎంవీఐ తెలిపారు. మిగతా బస్సులు బయట తిరగడం లేదని ఆయన పేర్కొన్నారు. రామగుండం, బసంత్‌నగర్ ప్రాంతాల్లో కూడా తనిఖీలు జరు పుతామని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల యాజమాన్యాలు నిబంధనల ప్రకారం స్కూల్ బస్సులను కండీషనల్‌లో ఉంచాలని, పరిమితిని మించి విద్యార్థులను తీసుకెళ్లరాదన్నారు.
Updated Date - Jun 17 , 2025 | 11:58 PM