ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యాప్రమాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

ABN, Publish Date - Jun 14 , 2025 | 12:30 AM

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల విద్యా ప్రమాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్ర వారం కలెక్టర్‌ కోయ శ్రీహర్ష కలెక్టరేట్‌లో విద్యాసంవత్సరం యాక్షన్‌ప్లాన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

పెద్దపల్లి కల్చరల్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల విద్యా ప్రమాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్ర వారం కలెక్టర్‌ కోయ శ్రీహర్ష కలెక్టరేట్‌లో విద్యాసంవత్సరం యాక్షన్‌ప్లాన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2025-26లో తొలిమెట్టు, ఉన్నతి వంటి వివిధ కార్యక్రమాల అమలు, పిల్లల అభ్యాసన సామర్థ్యాలు పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పాఠశాలల తనిఖీ షెడ్యూల్‌ తదితర అంశాలను జిల్లా విద్యాశాఖ వారు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రాథమికంగా పిల్లలకు తెలుగు, ఆంగ్లం చదవడం, రాయడం, కనీస గణిత సామర్ధ్యాలు ఉండేలా శిక్షణ అందించాలన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రతీ విద్యార్థి అభ్యాసన సామ ర్థ్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాఽశాఖ అధికారి డి.మాధవి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 12:30 AM