ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భూ భారతితో భూ సమస్యల పరిష్కారం

ABN, Publish Date - Apr 23 , 2025 | 12:30 AM

నూతన ఆర్వోఆర్‌ చట్టం భూభారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం సెంటినరీకాలనీ సింగరేణి కమ్యూ నిటీ హాల్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ వేణులు ప్రారంభించారు.

రామగిరి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): నూతన ఆర్వోఆర్‌ చట్టం భూభారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం సెంటినరీకాలనీ సింగరేణి కమ్యూ నిటీ హాల్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ వేణులు ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం భూ భారతి చట్టం రూపొందిం చిందన్నారు. అధికారులు అందించిన ఆర్డర్ల పై ఆప్పీల్‌ చేసుకునే అవకాశం ఉందన్నారు. గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్‌ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని, ఆ అవసరం లేకుండా అప్పీల్‌కు అవకాశం కల్పించిందన్నారు. అప్పీల్‌ వ్యవస్థ అందించిన తీర్పు తర్వాత కూడా సంతృప్తి చెందకపోతే సివిల్‌ కోర్టు వెళ్లవచ్చని, అవసరమైన ఉచిత న్యాయ సలహాను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతీ గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంద న్నారు. భూదార్‌ సంఖ్యతో భూఆక్రమ ణలకు చెక్‌ పెట్టవచ్చని తెలి పారు. పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా పరిష్కారానికి భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. ఆర్డీవో సతీష్‌, తహసీల్దార్‌ సుమన్‌, రెవెన్యూ అధికారులు, మండల ప్రజలు పాల్గొన్నారు. అనంతరం కల్వచర్ల, బేగంపేట్‌, నవాబ్‌ పేట్‌ గ్రామాల్లోని ఐకెపి కేంద్రాలను కలెక్టర్‌ తనిఖీ చేశారు.

రాజాపూర్‌ సమస్యలపై నిర్వాసితుల ఏకరువు

రాజాపూర్‌ గ్రామ సింగరేణి నిర్వాసితులు సమస్యలను కలెక్టర్‌ కోయ శ్రీహర్షకు ఏకరువు పెట్టారు. గతంలో సింగరేణి స్వాధీనం చేసుకున్న 708.16 గుంటల భూమిని అవార్డు క్యాన్సిల్‌ చేయడంతో తమకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ప్రస్తుతం ఎలాంటి నోటీసులు, ప్రజాభి ప్రాయం సేకరణ లేకుండానే 88 ఎకరాల్లో 24 ఎకరాలు సర్వే చేపట్టిందన్నారు. గ్రామంలోని గృహాలను పూర్తి స్థాయిలో సర్వే చేపట్టిన అనంతరమే భూమి ఇస్తామన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పటికే రెవెన్యూ అధికారులు గృహాలు సర్వే చేపట్టారని, మరో సారి సర్వే నిర్వహిస్తామని తొందరపడవద్దన్నారు. సింగరేణి చేపట్టే సర్వేను అడ్డుకొ వద్దని సూచించారు. దీని పై గ్రామస్థులు వ్యతిరేకిస్తూ గతంలో ఇదే విధానంతో నష్టపోయామని, సర్వేకు అంగికరించే పరిస్థితి ఉండదని పేర్కొనడంతో కలెక్టర్‌ వెనుదిరిగారు.

కమాన్‌పూర్‌, (ఆంధ్రజ్యోతి): భూభారతితో పెండింగ్‌ సాదాబైనామా దరఖాస్తులు పరిష్కారం అవుతాయని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం నాగారం రైతువేదిక వద్ధ నిర్వహించిన అవగాహన కార్య క్రమం నిర్వహించారు. భూభారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్‌ రైతులకు, ప్రజలకు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. రెవెన్యూ డివిజన్‌ అధికారి సురేష్‌, కమాన్‌పూర్‌ తహసీల్దార్‌ వాసంతి, రైతులు, వివిధ వర్గాల ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2025 | 12:30 AM