మహిళల రక్షణకే షీ టీంలు
ABN, Publish Date - Jul 29 , 2025 | 11:41 PM
మహిళల రక్షణకోసం షీ టీంలు పనిచేస్తున్నాయని షీ టీం సభ్యురాలు స్నేహలత అన్నారు. మంగళవారం హన్మంతునిపేట చైతన్య విద్యాభారతి హైస్కూల్‌లో సైబర్ నేరాలు, మహిళ రక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్నేహలత మాట్లాడుతూ మహిళల భద్రత, ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పెద్దపల్లి రూరల్ , జూలై 29 (ఆంధ్రజ్యోతి): మహిళల రక్షణకోసం షీ టీంలు పనిచేస్తున్నాయని షీ టీం సభ్యురాలు స్నేహలత అన్నారు. మంగళవారం హన్మంతునిపేట చైతన్య విద్యాభారతి హైస్కూల్‌లో సైబర్ నేరాలు, మహిళ రక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్నేహలత మాట్లాడుతూ మహిళల భద్రత, ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళల రక్షణ కోసం బస్టాండ్, ప్రధాన చౌరస్తాలు, జన సమీకరణ ప్రాంతాలు, కళాశాలల వద్ద షీ టీం నిరంతరం ఉంటుందన్నారు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు, విద్యార్థులు భయపడకుండా 6303923700 నెంబర్‌కి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. ఎవరైనా ఆన్‌లైన్‌ల ద్వారా మోసానికి గురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కి సమాచారం అందించాలన్నారు. షీ టీం సభ్యులు మవునిక, సురేష్, పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మణస్వామి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - Jul 29 , 2025 | 11:41 PM