ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైతు ముంగిటకు శాస్త్రవేత్తలు

ABN, Publish Date - May 04 , 2025 | 12:01 AM

రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించేం దుకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ యూనివర్సిటీ, వ్యవ సాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల ముంగిటకు శాస్త్ర వేత్తలు కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఈ నెల 5 నుంచి జూన్‌ 13 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వారాల పాటు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించేం దుకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ యూనివర్సిటీ, వ్యవ సాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల ముంగిటకు శాస్త్ర వేత్తలు కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఈ నెల 5 నుంచి జూన్‌ 13 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వారాల పాటు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో 5 నుంచి జూన్‌ 11 వరకు ఆరు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించను న్నారు. రాష్ట్రంలోని 415 మంది శాస్త్రవేత్తలు, 200 గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని నాలుగు మండలాల్లోని ఆరు గ్రామాల్లో ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో రైతులకు సాగు మెళకువలు, విత్తనోత్పత్తి, సస్యరక్షణ చర్యలు, నీటి యాజమాన్యం, తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు.

విత్తన ఎంపికపై అవగాహన

రైతులకు ముఖ్యంగా విత్తన ఎంపిక కీలకమని గుర్తించడం, విత్తనం తీసుకున్న వెంటనే రసీదును తీసుకోవాలని తద్వారా కలిగే ప్రయోజనాలను వివరిం చనున్నారు. పంట మార్పిడి వైపు ప్రోత్సహిస్తారు. పత్తి, వరి కొయ్యలు కాల్చడంతో కలిగే నష్టాలు, అధి కంగా యూరియా(నత్రజని) వాడకంతో కలిగే దుష్ప్ర భావాలను తెలపనున్నారు. వేసవి దుక్కులు, పచ్చిరొట్టె విత్తన సాగుతో కలిగే ప్రయోజనాలు, నూతన వంగ డాలు, రకాలపై శిక్షణ ఇవ్వనున్నారు. సంబంధించిన అంశాలపై శాస్త్రవేత్తలు గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పించనున్నారు.

జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్‌ మండలం గంగారం, తారుపల్లి, ముత్తారం మండలం ముత్తారం, ఓదెల మండలం జీలకుంట, పెద్దపల్లి మండలం రాంపెల్లి, హన్మంతునిపేట గ్రామాల్లో కూనారం వ్యవసాయ పరి శోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సిద్ధి శ్రీధర్‌ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం ఎంపిక చేసుకుని అవగాహన కల్పించనున్నారు. ఈ బృందంలో ఇద్దరు శాస్త్రవేత్తలు, ఇద్దరు బీఎస్సీ లేదా పాలిటెక్నిక్‌ డిప్లొమా చదువుతున్న విద్యార్థులు, వ్యవసాయశాఖ అధికారులు ఉండనున్నారు. ఆయా గ్రామాల్లోని రైతువేదికలు, పంచాయతీ కార్యాలయాల వద్ద రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.

విత్తనోత్పత్తికి ప్రణాళిక

గ్రామాల్లోనే నాణ్యమైన విత్తనాలను తయారు చేయాలనే సంకల్పంతో ప్రొఫెసర్‌ జయశంకర్‌ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ యాసంగి లేదా వచ్చే వానాకాలం సీజన్‌లో ఈ ప్రణాళికను ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామానికి ఐదుగురు రైతుల చొప్పున ఎంపిక చేసి వారికి యూని వర్సిటీ ఆధ్వర్యంలో రీసెర్చ్‌ చేసిన వంగడాలను అంద జేసి గ్రామస్థాయిలో నాణ్యమైన విత్తనాలను తయారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఆసక్తి గల రైతుల జాబి తాను రూపొందిస్తున్నారు. ఈ రైతులకు వరి, మొక్క జొన్న, పత్తి వంగడాలను అందజేసి విత్తనోత్పత్తిని గ్రామాల్లోనే చేసి రైతులపై విత్తన భారం పడకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - May 04 , 2025 | 12:01 AM