ఇసుక లారీలను నియంత్రించాలి
ABN, Publish Date - May 29 , 2025 | 11:24 PM
మండలంలోని గద్దలపల్లి గ్రామంలో ఇసుక లారీలను నియంత్రించాలని సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిరసన చేశారు. గద్దలపల్లి వద్ద ఇసుక లారీల పై నియంత్రణ లేక పోవడంతో బుధవారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుందన్నారు.
మంథనిరూరల్, మే 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గద్దలపల్లి గ్రామంలో ఇసుక లారీలను నియంత్రించాలని సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిరసన చేశారు. గద్దలపల్లి వద్ద ఇసుక లారీల పై నియంత్రణ లేక పోవడంతో బుధవారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుందన్నారు. ఖమ్మంపల్లి ఇసుక క్వారీ నుంచి వస్తున్న ఇసుక లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో వేగంగా వెళ్ళడంతో ప్రమాదం చోటు చేసుకుందని, ఆప్రాంతంలో రాత్రి సమయంలో ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు.
రాత్రి సమయంలో విచ్చల విడిగా ఇసుక రవాణా జరుగుతుందని, డ్రైవర్లు మద్యం సేవించి అధిక లోడు, అధిక వేగంగా నడపటం వలన ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వాటిని నియంత్రించడంలో సంబంధిత అధికారులు విఫలయ్యారన్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. సీపీఎం నేత బూడిద గణేష్, ఆర్ల సందీప్, గొర్రెక్కల సురేష్, అడ్డూరి రాజయ్య, దుర్గయ్య, సంపత్, రాజేష్‌లు పాల్గొన్నారు.
నిబంధనలు బేఖాతర్
ముత్తారం, మే 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఓడేడు గ్రామపంచాయతీ పరిధిలోని మానేరు శివారులోని దుబ్బ ఇసుకను రాత్రీ పగలు తేడా లేకుండా అడ్డగోలుగా లారీలలో రవాణా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గత సంవత్సరం పర్మిట్లను ఉపయోగించుకొని ప్రస్తుతం అక్రమంగా దుబ్బ ఇసుకను రవాణా చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రవాణా చేయాల్సి ఉండగా రాత్రీ పగలు తేడా లేకుండా వం దల లారీల్లో తరలిస్తున్నారు. బుధవారం అధిక దుమ్ము, అధికలోడు తో లారీలు వెల్లడంతో ఇండ్లలో ఉన్న వారికి ఇబ్బంది అవుతుందని గ్రామస్థులు అడ్డుకొన్నారు. కాంట్రాక్టర్ నామమాత్రంగా నీళ్ల ట్యాంకర్ ఏర్పాటు చేసి రోడ్డుపై నీటిని కొట్టిస్తు న్నాడు. ఉదయం వేళల్లో రవాణా చేయాలనే నిబంధనను పాటించడం లేదు. రాత్రి పగలు తేడా లేకుండా వందల సంఖ్యలో దుబ్బ ఇసుకతో పాటు మానేరు ఇసుకను కూడా తరలిస్తున్నారు. దీనిపై అధికారులు పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Updated Date - May 29 , 2025 | 11:24 PM