ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నేరాలకు పాల్పడే వారిపై రౌడీషీట్లు తెరవాలి

ABN, Publish Date - May 29 , 2025 | 11:29 PM

నేరాలకు పాల్పడే వారిపై రౌడీషీట్లు, సస్పెక్ట్‌ షీట్లు తెరవాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా పోలీస్‌ అధికారులకు సూచించారు. గురువారం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌ పోలీస్‌ అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పోలీస్‌స్టేషన్‌, డివిజన్‌, జోన్ల వారీగా పెండింగ్‌ కేసులకు సంబంధించి సమావేశాన్ని నిర్వహించారు.

కోల్‌సిటీ, మే 29(ఆంధ్రజ్యోతి): నేరాలకు పాల్పడే వారిపై రౌడీషీట్లు, సస్పెక్ట్‌ షీట్లు తెరవాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా పోలీస్‌ అధికారులకు సూచించారు. గురువారం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌ పోలీస్‌ అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పోలీస్‌స్టేషన్‌, డివిజన్‌, జోన్ల వారీగా పెండింగ్‌ కేసులకు సంబంధించి సమావేశాన్ని నిర్వహించారు. నేరస్థుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాలు, చార్జిషీట్‌కు సంబంధించి ప్రస్తుత కేసుల స్థితిగతులపై కమిషనర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నమోదైన గ్రేవ్‌ కేసులు, మహిళలపై నేరాలు, ఆస్తి నేరాలు, ఫోక్సో కేసులు, మిస్సింగ్‌, గంజాయి, రోడ్డు ప్రమాదాల కేసులకు సంబంధించి సమాచారంతోపాటు కేసుల పరిష్కారం త్వరగా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రధానంగా మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయడంతోపాటు నిందితులకు కోర్టుల్లో శిక్షలు పడే విధంగా సాక్ష్యాధారాలను అందజేయాలని సూచించారు. బాలికల మిస్సింగ్‌ కేసుల్లో అధికారులు వేగంగా స్పందించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, దొంగతనాలు జరుగకుండా పోలీస్‌ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విజుబుల్‌ పోలీసింగ్‌, పెట్రోలింగ్‌ ముమ్మరం చేయాలని, చోరీలకు పాల్పడిన నేరస్థులను గుర్తించడంతో పాటు చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంతో సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ దర్యాప్తు కొనసాగించాలని సూచించారు.

రౌడీషీటర్లు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ముందస్తు సమాచారాన్ని సేకరించాలని, కేసులలో పరిశోధన పారదర్శకంగా ఉండాలన్నారు. బక్రీద్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టుల్లో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, పీస్‌ కమిటీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్‌, అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) రాజు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ మల్లారెడ్డి, గోదావరిఖని ఏసీపీ రమేష్‌, పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్‌, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌, రామగుండం ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాస్‌, ఏఆర్‌ ఏసీపీ ప్రతాప్‌, ఏఓ శ్రీనివాస్‌తో పాటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2025 | 11:29 PM