రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
ABN, Publish Date - Jun 06 , 2025 | 12:24 AM
భూ భారతి రెవె న్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ జేరుపోతుల సునీత అన్నారు. గురువారం గుడిపెల్లి, రాణాపూర్ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. రైతుల నుంచి అర్జీలను స్వీకరించారు.
పాలకుర్తి,జూన్ 5 (ఆంధ్రజ్యోతి): భూ భారతి రెవె న్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ జేరుపోతుల సునీత అన్నారు. గురువారం గుడిపెల్లి, రాణాపూర్ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. మాజీ ఎంపీపీ గంగాధరి రమేష్ గౌడ్, మాజీ సర్పంచ్‌లు కొప్పు పుష్పలత రాజేశం, బాలసాని కుమార్‌గౌడ్, మాజీ ఎంపీటీసి సదానందం పాల్గొన్నారు.
పెద్దపల్లి రూరల్, (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో నిర్వహి స్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ రాజయ్య అన్నారు. అప్ప న్నపేటలో రెవెన్యూ సదస్సు నిర్వహించగా తహసీల్దార్ పాల్గొన్నారు. రైతుల నుంచి అర్జీలను స్వీకరించారు. రాగినేడులో డిప్యూటీ తహసీల్దార్ విజేందర్ బృందం రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. నిమ్మనపల్లి గ్రామంలో దరఖాస్తులను స్వీకరించారు. ఆర్‌ఐలు భాను, వెంకట రాజిరెడ్డిలతో కార్యదర్శులు పాల్గొన్నారు.
అంతర్గాం, (ఆంధ్రజ్యోతి): భూ సమస్యల పరిష్కా రమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం భూ భారతి కార్య క్రమంను నిర్వహిస్తున్నదని రామగుండం తహసీల్దార్ దత్తు ప్రసాద్ అన్నారు. ఆబాది రామగుండంలో నిర్వ హించిన రెవెన్యూ సదస్సులో మాట్లాడారు. రైతులు భూ సమస్యలు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. నాయ బ్ తహసీల్దార్ ఈశ్వర్, కాంగ్రెస్ నాయకుడు ఈదు నూరి హరి ప్రసాద్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jun 06 , 2025 | 12:24 AM