ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలి

ABN, Publish Date - Jun 06 , 2025 | 12:28 AM

సమాజంలో ఆశిస్తున్న మార్పు మన నుంచే ప్రారంభం కావాలని, ప్లాస్టిక్‌ వాడకం తగ్గించాలని, చెత్తను సెగ్రిగేట్‌ చేయా లని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఆవ రణలో డీసీపీ కరుణాకర్‌, అదనపు కలెక్టర్‌ డి.వేణుతో కలిసి ఏక్‌ పెడ్‌ మాకే నామ్‌ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

పెద్దపల్లిటౌన్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి) సమాజంలో ఆశిస్తున్న మార్పు మన నుంచే ప్రారంభం కావాలని, ప్లాస్టిక్‌ వాడకం తగ్గించాలని, చెత్తను సెగ్రిగేట్‌ చేయా లని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఆవ రణలో డీసీపీ కరుణాకర్‌, అదనపు కలెక్టర్‌ డి.వేణుతో కలిసి ఏక్‌ పెడ్‌ మాకే నామ్‌ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి తల్లి పేరిట మొక్క నాటాలని, తద్వారా ఉష్ణోగ్ర తను తగ్గించుకొని పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు ఇవ్వాలన్నారు. కలెక్టరేట్‌లోని కార్యాలయ ఆవరణలో ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఇంటి వద్ద కూడా ప్లాస్టిక్‌ వాడకం నివారించాలని, ప్రజలలో మనం ఆశిస్తున్న మార్పు మన నుంచే ప్రారంభం కావాలని కలెక్టర్‌ తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌ ఆవరణలో ప్లాస్టిక్‌ ఏరివేత కార్యక్రమంలో అటవీ శాఖ అధికారి శివయ్య, అధికారులు, పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2025 | 12:28 AM