ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వ పాఠశాలల్లోనే నిష్ణాతులైన ఉపాధ్యాయులు

ABN, Publish Date - Jun 13 , 2025 | 12:19 AM

ప్రభుత్వ పాఠశాలల్లోనే నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, వారు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి గుణాత్మక విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారని జిల్లా విద్యాధికారి మాధవి అన్నారు. గురువారం పత్తిపాక ప్రాథమిక, ఉన్నత పాఠ శాలలను పరిశీలించారు.

ధర్మారం, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి) ప్రభుత్వ పాఠశాలల్లోనే నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, వారు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి గుణాత్మక విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారని జిల్లా విద్యాధికారి మాధవి అన్నారు. గురువారం పత్తిపాక ప్రాథమిక, ఉన్నత పాఠ శాలలను పరిశీలించారు. పత్తిపాక ప్రాథమిక పాఠశాలలో మొదటి రోజే 10 మంది విద్యార్థులు అడ్మిషన్‌ తీసుకోవడంపై డీఈవో సంతోషం వ్యక్తం చేశా రు. అనంతరం ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి మధ్యా హ్న భోజనం చేశారు. పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌లో పాల్గొని తల్లిదండ్రులు వారి పిల్లలతో స్నేహభావంతో ఉండాలని సూచించారు. మండల విద్యాధికారి పి.ప్రభాకర్‌ మాట్లాడుతూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ఖండేరావు పరీక్షిత్‌ నరేం దర్‌రావు, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం నూతి మల్లన్న కాంప్లెక్స్‌ రిసోర్స్‌ పర్సన్‌ ప్రేంసాగర్‌, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

16వ తేదీలోగా పుస్తకాలను అందించాలి

పెద్దపల్లి కల్చరల్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారంలోగా పూర్తిస్థాయిలో విద్యార్థులకు ఉచిత పాఠ్య, నోటు పుస్తకాలను అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి తెలిపారు. మండల విద్యాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1,72,348 పాఠ్య పుస్తకాలు ఇప్పటికే పాఠశాలలకు చేరుకోగా అందులో ఇప్పటివరకు 50,668 పంపిణీ చేశామని, 2,11,491 నోట్‌బుక్స్‌ పాఠశాలలకు రాగా అందులో 64,458 విద్యార్థులకు అందించినట్లు తెలిపారు. 30,687విద్యార్థులకు ఏకరూప దుస్తులకు గాను 17,866జతల యూనిఫామ్స్‌ పాఠశాలలకు చేరగా 10,281 జతల దుస్తులను విద్యార్థులకు అందించినట్లు వివరించారు. పాఠశాలలు ప్రారంభమైన దృష్ట్యా త్వరితగతిన పంపిణీ కార్యక్రమం పూర్తిచేయాలన్నారు. గురువారం నాటికి 1,924 ప్రవేశాలు జిల్లా వ్యాప్తంగా 1,6వ తరగతుల్లో నమోదు అయినట్టు తెలిపారు.

Updated Date - Jun 13 , 2025 | 12:19 AM