ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పంప్‌డ్‌ స్టోరేజీ ప్లాంట్‌ సింగరేణికి కీలకం

ABN, Publish Date - Jul 05 , 2025 | 11:35 PM

రామగుండం మేడిపల్లి ఓసీపీ-4లో ఏర్పాటు చేస్తున్న 500మెగావాట్ల పంప్‌డ్‌ స్టోరేజీ విద్యుత్‌ ప్లాంట్‌ సింగ రేణికి కీలకం కానున్నదని డైరెక్టర్‌(ఈఅండ్‌ఎం) సత్యనారాయణరావు అన్నారు. శనివారం ఆయన మూతపడిన ఓసీపీ-4ను సందర్శించారు.

గోదావరిఖని, జూలై 5(ఆంధ్రజ్యోతి): రామగుండం మేడిపల్లి ఓసీపీ-4లో ఏర్పాటు చేస్తున్న 500మెగావాట్ల పంప్‌డ్‌ స్టోరేజీ విద్యుత్‌ ప్లాంట్‌ సింగ రేణికి కీలకం కానున్నదని డైరెక్టర్‌(ఈఅండ్‌ఎం) సత్యనారాయణరావు అన్నారు. శనివారం ఆయన మూతపడిన ఓసీపీ-4ను సందర్శించారు. పం ప్‌డ్‌ స్టోరేజీ ప్లాంట్‌ నిర్మాణానికి సంబంధించి చేపట్టాల్సిన పనులను అధికా రులతో చర్చించారు. ప్రాజెక్టు ఫిజికల్‌ రిపోర్టు, డీపీఆర్‌లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి వ్యాప్కోస్‌ సంస్థతో చర్చించారు. ప్రాజెక్టుకు సంబంధించిన మ్యాప్‌లను పరి శీలించారు.

సింగరేణిలో మొదటి సారిగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 500 మెగావాట్ల పంప్‌డ్‌ స్టోరేజీ విద్యుత్‌ ప్లాంట్‌ రాష్ట్రంలోనే మొదటిదని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే భవిష్యత్‌లో మరిన్ని కొత్త ప్రాజెక్టుల నిర్మాణంలో ఇది కీలక మలుపని డైరెక్టర్‌ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా పెరు గుతున్న పోటీ దృష్ట్యా సింగరేణి బొగ్గు ఉత్పత్తినే కాకుండా థర్మల్‌, సోలార్‌ విద్యుత్‌, విండ్‌ ఎనర్జీతోపాటు మూతపడిన ఓసీపీల్లో పంప్‌డ్‌ స్టోరేజీ ప్లాం ట్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తికి సిద్ధం కావడం కొత్త అధ్యయనం అన్నారు. కాలానికి అనుగుణంగా సింగరేణి నూతన సాంకేతికతతో దేశంలోనే అత్యు త్తమ సంస్థగా ఏర్పడుతుందని చెప్పారు. డైరెక్టర్‌తో పాటు ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్‌, ఇన్‌చార్జి ఎస్‌ఓటూ జీఎం ఆంజనేయప్రసాద్‌, అధికారులు రమేష్‌, మురళీధర్‌, విశ్వనాథ్‌, ప్రభాకర్‌, శ్రీనివాస్‌, జితేందర్‌సింగ్‌, లక్ష్మీరా జం, వసంత్‌కుమార్‌, వీరారెడ్డి, మల్లికార్జున్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 11:35 PM