ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని పెంచాలి
ABN, Publish Date - Jun 20 , 2025 | 11:45 PM
పోలీసులపై ప్రజల్లో నమ్మ కం కలిగే విధంగా విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిష నర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. సుల్తానాబాద్ పోలీస్‌స్టేషన్‌ను శుక్ర వారం తనిఖీ చేశారు. అధికారులు మొక్క అందించి స్వాగతం పలికారు.
సుల్తానాబాద్, జూన్ 20: (ఆంధ్రజ్యోతి): పోలీసులపై ప్రజల్లో నమ్మ కం కలిగే విధంగా విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిష నర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. సుల్తానాబాద్ పోలీస్‌స్టేషన్‌ను శుక్ర వారం తనిఖీ చేశారు. అధికారులు మొక్క అందించి స్వాగతం పలికారు. సీపీ ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. రిసెప్షన్‌లో సిబ్బంది పని తీరును పరిశీలించి ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, రౌడీ షీటర్ల వివ రాలు తెలుసుకున్నారు. రాజీవ్ రహదారి పై జరుగుతున్న ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు, కోర్టుల్లో పెండింగ్ ఉన్న కేసులు, వాటికి సంబంధించి దర్యాప్తు వివరాలను తెలుసుకున్నారు.
స్టేషన్‌లో నిర్వహిస్తున్న పలు రికార్డులను పరిశీలించారు. సీపీ మాట్లాడుతు ప్రజలు అందించే ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని, నేర పరిశోధన దర్యా ప్తుల్లో సాంకేతిక విజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నిందితులకు శిక్ష పడేలా సాంకేతికను ఉపయోగించుకోవాలన్నారు. సమస్యతో స్టేషన్‌కు వచ్చే వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. ఆవరణలో సీపీ మొక్కలు నాటారు. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ జి కృష్ణ, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి,ఎస్‌ఐ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.
Updated Date - Jun 20 , 2025 | 11:45 PM