ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలి
ABN, Publish Date - Jul 28 , 2025 | 11:51 PM
ప్రజావాణికి వచ్చే అర్జీలను సత్వ రమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. గోదావరి ఖని ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త బి.వంశీకృష్ణ బెల్ట్‌షాపులపై తప్పుడు సమాచారం ఇచ్చారని, నిబంధనలకు విరుద్ధంగా రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలో వైన్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూములు ఏర్పాటు చేశారని, తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని దరఖాస్తు చేసుకోగా ఎక్సైజ్ అధి కారికి రాశారు.
పెద్దపల్లిటౌన్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణికి వచ్చే అర్జీలను సత్వ రమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. గోదావరి ఖని ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త బి.వంశీకృష్ణ బెల్ట్‌షాపులపై తప్పుడు సమాచారం ఇచ్చారని, నిబంధనలకు విరుద్ధంగా రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలో వైన్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూములు ఏర్పాటు చేశారని, తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని దరఖాస్తు చేసుకోగా ఎక్సైజ్ అధి కారికి రాశారు. రామగుండం ఇందిరానగర్‌కు చెందిన కల్లూరు వెంకటి ఇద్దరు పిల్లలు పట్టించుకోవడం లేదని, న్యాయం చేయాలని దరఖాస్తు చేసుకోగా ఆర్డీవోకు రాశారు. పెద్దపల్లి పట్టణానికి చెందిన బృందావన్ కాలనీ వాసులు నివాసాల సమీపంలో ఉన్న రైస్‌మిల్లుల నుంచి బూడిద, దుర్వాసన వెదజల్లే పొగను వ్యర్థ జలాలను విడుదల చేస్తున్నాయని, కాలనీలో నివసించే ప్రజలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని దరఖాస్తు చేసుకోగా ఆర్డీవోకు రాశారు. అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 28 , 2025 | 11:51 PM