ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

ABN, Publish Date - Apr 28 , 2025 | 11:38 PM

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ డి.వేణు అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్య క్రమంలో అదనపు కలెక్టర్‌ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

పెద్దపల్లిటౌన్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ డి.వేణు అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్య క్రమంలో అదనపు కలెక్టర్‌ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలన్నారు. కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన కనకయ్య సర్వే నెంబర్‌ 778 లో 30 గుంటలు, 779 లో 30 గుంటల భూమి ఉందని, భూ భారతి ద్వారా పట్టా ఇప్పించాలని దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్‌కు చర్యలు తీసుకోవాలని ఆధేశించారు. రామగిరి మండలం పన్నూరు గ్రామానికి చెందిన డి.నరేందర్‌ ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 76 ప్రకారం సర్వే నంబర్‌ 68లో 125 చదరపు గజాల భూమి తల్లికి వచ్చిం దన్నారు. ఆమె 2020 అక్టోబర్‌ 18 న మరణించారని ఆ భూమిని తమ పేరు మీద మార్చాలని దరఖాస్తు చేసుకొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు, పాల్గొన్నారు

Updated Date - Apr 28 , 2025 | 11:38 PM