ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
ABN, Publish Date - Jun 30 , 2025 | 11:57 PM
ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలు తెలుపుతూ ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
పెద్దపల్లిటౌన్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి) ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలు తెలుపుతూ ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. పెద్దపల్లి మండలం పెద్ద బొంకూరు గ్రామానికి చెందిన రమేష్ తనకు గ్రామ శివారు లో మొత్తం 2 ఎకరాల వ్యవసాయ భూమికి ఉందని, రైతుభరోసా అమలు కావడం లేదని దరఖాస్తు చేసుకోగా జిల్లా వ్యవసాయ అధికారికి రాశారు. రామగుండం మండలం కుందనపల్లి గ్రామానికి చెందిన వేల్పుల అనూష అర్హతలు ఉన్నప్పటికీ గృహ జ్యోతి పథకం అమలు కావడంలేదని, అమలు చేయాలని దరఖాస్తు చేసుకోగా విద్యుత్ శాఖ ఎస్‌ఈకి పరిశీలించాలని రాశారు. పెద్దపెల్లి పట్టణంలోని తాజ్ కాలనీ రోడ్డు కు చెందిన అస్మిత్ జహన్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
Updated Date - Jun 30 , 2025 | 11:57 PM