ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
ABN, Publish Date - May 20 , 2025 | 12:00 AM
ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి దరఖాస్తులను స్వీకరించారు.
పెద్దపల్లిటౌన్ మే 19 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. కమాన్‌పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన ప్రతాప్ గ్రామ శివారు సర్వే నెంబర్ 48లో గల 27 గుంటల భూమి మాజీ సర్పంచ్ ఆకుల గట్టయ్య అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, తనకు భూమి ఇప్పించాలని దరఖాస్తు చేసుకోగా మంథని ఆర్డీవోకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పెద్దపల్లి పట్టణం బం డారి కుంటకు చెందిన శ్రీధర్ 34వ వార్డులో ఉన్న భూమిని అంజయ్య అనే వ్యక్తి ఆక్రమించుకుని నిర్మాణం చేశాడని, దీనిపై విచారించి చర్యలు తీసుకో వాలని కోరారు. సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన కొదురుపాక రైతులు చెరువు కట్ట నుంచి పొలాలకు వెళ్లే రోడ్డుకు బండలు వేసి రాకపోకలు నిలిపి వేస్తున్నారని దరఖాస్తు అందజేశారు. పెద్దపల్లి పట్ట ణానికి చెందిన షహీదా బేగం ఇద్దరు పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్నానని, పదో తరగతి వరకు చదివానని, ఉపాధి చూపించాలని దరఖాస్తు చేసు కోగా వారథి సొసైటీకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రజా వాణిలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 20 , 2025 | 12:00 AM