రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి
ABN, Publish Date - Jun 25 , 2025 | 11:46 PM
గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని, మందులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్య సిబ్బందికి సూచిం చారు. బుధవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేశారు.
కళ్యాణ్‌నగర్, జూన్ 25(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని, మందులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్య సిబ్బందికి సూచిం చారు. బుధవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. డ్రగ్‌స్టోర్, సెంట్రల్ ల్యాబ్, పిడియాట్రిక్, హార్ట్ సెంటర్, స్కిన్ చికిత్స విభాగాలను పరిశీలించారు. నవజాత శిశు సంరక్షణ ప్రత్యేక యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పిల్లల కోసం వార్మర్లను కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ల్యాబ్ వైద్య పరీక్ష రికార్డులను పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేయాలని, ల్యాబ్ నుంచి వైద్య పరీక్షల ఫలితాలు గంట సమయంలో వచ్చేలా చర్యలు తీసుకోవాలని, డ్రగ్‌స్టోర్ గడువు ముగిసిన మందులు తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆసుప త్రిలో పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యం కల్పించాలని, పరిసరాలను పరి శుభ్రంగా ఉంచుకో వాలని, ఇన్‌పేషెంట్లకు మరిన్ని వైద్య సేవలు అందిం చాలని కోరారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో 142కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న 355 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీ లించారు. నవంబర్ నాటికి పూర్తి స్థాయిలో ఆసుపత్రిని నిర్మించి రోగులకు అందు బాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట ప్రిన్సిపాల్ హిమ బిందు, ఆర్‌ఎంఓ రాజు ఉన్నారు.
Updated Date - Jun 25 , 2025 | 11:46 PM