కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు
ABN, Publish Date - May 20 , 2025 | 11:56 PM
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గోదా వరిఖనిలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర సన ర్యాలీలు, లేబర్ కోడ్ పత్రులను దహనం చేశారు. ఆయా గనులు, డిపార్ట్‌మెంట్లపై కార్మి కులు ప్ల కార్డులతో నిరసన వ్యక్తం చేశారు.
గోదావరిఖని, మే 20(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గోదా వరిఖనిలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర సన ర్యాలీలు, లేబర్ కోడ్ పత్రులను దహనం చేశారు. ఆయా గనులు, డిపార్ట్‌మెంట్లపై కార్మి కులు ప్ల కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ మాట్లాడు తూ కార్మికులు అనేక పోరాటాలు, ప్రాణత్యా గాలతో సాధించుకున్న 44కార్మిక చట్టాలను కుదించిందని, దీంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. లేబర్ కోడ్‌లుగా సవ రించడంతో ప్రభుత్వరంగ పరిశ్రమలు లక్షల కోట్ల ఆదాయాన్ని దేశాన్ని సమకూర్చే వనరు లను కార్పొరేట్ శక్తులకు అమ్ముకుంటున్నా యని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు హక్కులు లేకుండా చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని, మోదీ ప్రభుత్వం 3వ సారి అధికారంలోకి వచ్చిన తరువాత కార్మి కులపై పని ఒత్తిడి పెరిగిందని, నాలుగు లేబ ర్ కోడ్‌లను ఉపసంహరించుకోకపోతే ఉద్య మం చేస్తామని హెచ్చరించారు. నాయకులు ఈదునూరి నరేష్, వెంకన్న, బ్రహ్మానందం, రామకృష్ణ, రాజేశం, బుచ్చమ్మ, శారద, మేరి, రాజేశ్వరి, ఎడ్ల రవికుమార్ పాల్గొన్నారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో కాం ట్రాక్టు కార్మికులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్‌జీ-1 పరిధిలోని పలు ఏరి యాల్లోని పని స్థలాల్లో కాం ట్రాక్టు కార్మికులు నల్ల బ్యాడ్జీ లు ధరించి విధులకు హాజర య్యారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి మాట్లాడుతూ మోదీ ప్రభు త్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని, దేశ వ్యాప్తంగా అన్నీ కార్మిక సంఘాలు టోకెన్ సమ్మెకు పిలు పునివ్వగా దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా జూలై 9కి వాయిదా వేశామన్నారు. నాయకులు సారయ్య, రాజు, ఆదిలక్ష్మి, కోమ లత, రోజ, ఇంద్ర, మరియమ్మ, వసంత, కోమ ల, రాజేశ్వరి, పద్మ, దీక్షకుమారి పాల్గొన్నారు.
Updated Date - May 20 , 2025 | 11:56 PM