ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భూనిర్వాసితులకు సరైన పరిహారం అందించాలి

ABN, Publish Date - May 10 , 2025 | 11:20 PM

జాతీయ రహదారి నిర్మా ణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు అర్హతల ఆధారంగా సరైన పరిహారం అందించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం పుట్టపాక గ్రామంలో భూనిర్వాసితుల సమావేశంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వరంగల్‌-మంచిర్యాల గ్రీన్‌ఫీల్డు హైవే నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు అర్హతల ఆధారంగా సరైన పరిహారం ఇవ్వాలన్నారు.

మంథనిరూరల్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి నిర్మా ణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు అర్హతల ఆధారంగా సరైన పరిహారం అందించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం పుట్టపాక గ్రామంలో భూనిర్వాసితుల సమావేశంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వరంగల్‌-మంచిర్యాల గ్రీన్‌ఫీల్డు హైవే నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు అర్హతల ఆధారంగా సరైన పరిహారం ఇవ్వాలన్నారు. రైతులు ఇచ్చిన భూముల్లో బావులు, మోటార్లు, పైప్‌లైన్లు, పండ్ల చెట్లకు పరిహారం సరిగా అందలేదని నిర్వాసితులు దరఖాస్తులు చేశార న్నారు. నిర్వాసితులు ఇచ్చిన ప్రతీ దరఖాస్తును అధికా రులు క్షేత్రస్థాయిలో పరిశీలించి భూసేకరణ జరిగే భూముల్లో ఉన్న నిర్మాణాలకు సరైన విలువను తేల్చి ప్రతిపాదనలు తయారు చేసి అందజేయాలని అధికారు లను ఆదేశించారు. భూములు కోల్పోతున్న నిర్వాసితులకు భూమిలో ఉన్న ప్రతీ నిర్మాణానికి ప్రభుత్వ నిబంధనలు ప్రకారం పరిహారం అందజేసేలా చర్యలు తీసుకుంటామని, అధికారులు అందించే నివేదిక ప్రకారం జాతీయ రహదారుల సంస్థకు ప్రతిపాదనలు పంపి పరిహారం అంద జేస్తామని తెలిపారు. ఆర్డీవో సురేష్‌, డీఎఫ్‌ఓ శివయ్య, ఆర్‌అండ్‌బీ ఈఈ బావుసింగ్‌, హార్టికల్చర్‌ జిల్లా అధికారి జగన్మోహన్‌రెడ్డి, తహసీ ల్దార్‌ కుమారస్వామి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2025 | 11:20 PM