ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

ABN, Publish Date - Jul 04 , 2025 | 11:49 PM

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చ లేదని ఆటో డైవ్రర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఆటో యూనియన్‌ జేఏసీ నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్‌, రాష్ట్ర చైర్మన్‌ గాజుల ముఖేష్‌ గౌడ్‌ మాట్లాడారు.

పెద్దపల్లిటౌన్‌, జూలై 4(ఆంధ్రజ్యోతి) తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చ లేదని ఆటో డైవ్రర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఆటో యూనియన్‌ జేఏసీ నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్‌, రాష్ట్ర చైర్మన్‌ గాజుల ముఖేష్‌ గౌడ్‌ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను విస్మరిం చారని ఆరోపించారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఆటో డైవ్రర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు, నెలకు 12 వేల రూపాయల ఆర్థిక సహా యం, ఇళ్లు లేని వారికి ఇళ్ల నిర్మాణం వంటివి హామీ ఇచ్చారన్నారు.

18 నెలలు గడిచినా ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆదాయాన్ని తగ్గిం దని, దీంతో ఇప్పటివరకు వంద మందికి పైగా ఆత్మహత్య చేసుకు న్నారన్నారు. వచ్చే కేబినెట్‌ సమావేశంలో తమ సమస్యలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమస్యలను పరిష్కరిం చకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో తమ బలాన్ని ప్రదర్శిస్తామని హెచ్చరించారు. స్థానిక ఎన్నికలకు ముందు మంచిర్యాలలో బహిరం గ సభ నిర్వహించి, తమను మోసం చేసిన వారికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షుడు సురేష్‌, ఉపాధ్యక్షులు ఎనగందుల నాంపల్లి, కుమార్‌, తొగరి సుధాకర్‌, ప్రధాన కార్యదర్శి సదానందం, కోశాధికారి లంకెల వెంకటేష్‌,బి పవర్‌ హౌస్‌ అడ్డ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె జబ్బార్‌, పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 11:49 PM