ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వన మహోత్సవానికి సన్నద్ధం

ABN, Publish Date - May 27 , 2025 | 12:46 AM

రాష్ట్రంలో పచ్చదనాన్ని విస్తరింపజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం యేటా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపడుతోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో హరితహారం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించగా కాంగ్రెస్‌ ప్రభుత్వం వన మహోత్సవం పేరుతో మొక్కలు నాటుతోంది.

జగిత్యాల, మే 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పచ్చదనాన్ని విస్తరింపజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం యేటా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపడుతోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో హరితహారం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించగా కాంగ్రెస్‌ ప్రభుత్వం వన మహోత్సవం పేరుతో మొక్కలు నాటుతోంది. ఈ ఏడాది జిల్లాలో 49.98 లక్షల మొక్కలు నాటాలని వివిధ ప్రభుత్వ శాఖలకు లక్ష్యాలు కేటాయించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో డీఆర్‌డీఏ, అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో జూన్‌ మొదటి వారంలో మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. జిల్లాలో అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు వన మహోత్సవం కింద పకడ్బందీ కార్యచరణ రూపొందించారు.

ఫనర్సరీల్లో మొక్కలు సిద్ధం

రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీల్లో పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో జూన్‌, జూలై, ఆగస్టు మాసాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ప్రతి గ్రామంలో వన నర్సరీల ద్వారా మొక్కలు పెంచి అదే గ్రామంలో నాటించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎదురైన అనుభవాలు, తప్పిదాలు పునరావృత్తం కాకుండా అవసరమైన జాగ్రత్తలను అధికారులు తీసుకుంటున్నారు. పదో విడత హరితహారంలో జిల్లాలో 49.98 లక్షల మొక్కలు వివిధ ప్రభుత్వ శాఖలకు లక్ష్యాలు కేటాయించారు. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, రాయికల్‌, మెట్‌పల్లి మున్సిపాలిటీల్లో 12 నర్సరీలు, జిల్లాలోని 380 పంచాయతీల్లో అటవీ శాఖ, ఉద్యానవన శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు పెంచారు.

ఫప్రతీ ఇంటికి మొక్కలు పంపిణీ

జిల్లాలో పదో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఇంటికి మొక్కలు ఇచ్చి నాటేందుకు ప్రోత్సహించనున్నారు. ప్రజలు అడిగిన మొక్కలను అందజేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఇళ్లలో ప్రధానంగా పెంచే గులాబీ, మందార, గన్నేరు, సీతాఫలం, జామ, ఉసిరి, అల్ల నేరేడు, మునగ, కానుగ, తులసి, ఈత మొక్కలతో పాటు పలు ఔషద మొక్కలు, పూల మొక్కలను సిద్ధం చేస్తున్నారు. పలు మొక్కలను ప్రభుత్వ స్థలాలు, రహదారులకు ఇరువైపులా, పొలం, చెరువు గట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు, కమ్యూనిటీ కేంద్రాలు, వైద్య శాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఆవరణల్లో నాటేందుకు ప్రణాళిక రూపొందించారు. దీంతో పాటు అటవీ ప్రాంతాల్లో మరింత ఆహ్లాదాన్ని పెంచే విధంగా పలు పూల, పండ్ల మొక్కలను నాటేందుకు సిద్ధమవుతున్నారు.

ఫప్రభుత్వ శాఖల వారీగా లక్ష్యం..

జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల వారీగా మొక్కలు నాటే లక్ష్యాన్ని ఉన్నతాధికారులు విధించారు. పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో 38.43 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించారు. వ్యవసాయ శాఖ 1.62 లక్షలు, ఆర్‌అండ్‌బీ 55 వేలు, నీటి పారుదల శాఖ 22 వేలు, రెవెన్యూ 28 వేలు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ 7.81 లక్షలు, గృహ నిర్మాణ శాఖ 55 వేలు, విద్యాశాఖ 2 వేలు, పశు సంవర్థక శాఖ ఒక వెయ్యి, మైన్స్‌ అండ్‌ జియోలాజీ 12 వేలు, యూత్‌ అడ్వాన్స్‌మెంట్‌ టూరిజం అండ్‌ కల్చర్‌ 5 వేలు, సివిల్‌ సప్లయి 5 వేలు, ఇతర శాఖలు 1.44 లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యాన్ని విధించారు.

వంద శాతం లక్ష్యం సాధిస్తాం

-రఘువరన్‌, డీఆర్‌డీవో

జిల్లాలో వన మహోత్సవం కింద నిర్దేశించిన లక్ష్యాన్ని వంద సాధించేలా ముందుకు వెళ్తున్నాం. ఇందుకు అనుగుణంగా నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నాం. పంచాయతీలు, మున్సిపాలిటీల వారీగా లక్ష్యం నిర్ణయించుకున్నాం. అన్ని వర్గాల సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం.

Updated Date - May 27 , 2025 | 12:46 AM