Home » Jagtial
జిల్లాలో పలు గుట్టలను అక్రమార్కులు ఒక్కొక్కటిగా కాలగర్భంలో కలిపేస్తున్నారు. పలు గ్రామాల చుట్టూ సహజ సిద్ధంగా హరితవనాలతో ఆహ్లాదాన్ని పంచే పచ్చని గుట్టలపై జరుగుతున్న ప్రకృతి విధ్వంసం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. వీటి వెనుక పలువురు నేతలు ఉండడంతో అడ్డుకోవాల్సిన అధికారులు మిన్నకుండిపోతున్నారు.
ప్రస్తుత వానాకాలం సీజన్‌లో రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయనున్న ధాన్యాన్ని మిల్లర్లకు ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల వారీగా ధాన్యాన్ని నిల్వ చేసేందుకు గోదాములు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి. ఇందుకు అనువైన ప్రభుత్వ, ప్రైవేట్ గోదాములను గుర్తించే పనిలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఉన్నారు.
జగిత్యాల జిల్లాలోని తులసినగర్‌లో విషాదం చోటు చేసుకుంది. డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడి మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. గుండెపోటుతో జయంత్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లా కేంద్రంలో సెంట్రలైజ్డ్ కిచెన్(కేంద్రీకృత సామాజిక వంటశాల)ను ఏర్పాటు చేస్తోంది. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఈ వంటశాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. త్వరలో పనులు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది.
జిల్లాలో సోమవారం నుంచి వినాయక నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. గణనాథుడిని కొలువుదీర్చేందుకు భక్తులు మండపాలను ముస్తాబు చేయగా, విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. పలు చోట్ల మట్టి వినాయక విగ్రహాలు, కర్ర వినాయకులను కొలువుదీర్చేందుకు ఏర్పాట్లు చేయగా ఆయా ప్రాంతాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల రూపురేఖలు మారుతున్నాయి. కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా కాలేజీ బ్యాగులు, బ్రాండెడ్ షూస్, సాక్సులు అందించే కార్య క్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది.
భవిష్యత్తు అవసరాలు, నగర, పట్టణాల ప్రగతికి దిశానిర్దేశంగా నిలిచే మాస్టర్‌ప్లాన్ (బృహత్తర ప్రణాళిక) అమలు విషయంలో జిల్లాలో నిరీక్షణ తప్పడం లేదు. సిద్ధం చేసిన ప్రతిపాదనలు ఆమోదం దశలో ఉండడంతో సర్కారు నిర్ణయం కోసం నిరీక్షించాల్సి వస్తోంది. నానాటికి విస్తరిస్తున్న కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల రూపురేఖలు మరింతగా మారడానికి ఇది అనివార్యం.
భూభారతి అమలు, భూ రికార్డుల ప్రక్షాళన, రీ సర్వే తదితర అంశాల్లో నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడంతో రెవెన్యూ శాఖలో కలవరం మొదలైంది. ఇటీవల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లాలో పర్యటించి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సమస్యలు, భూ రీ సర్వే, 22-ఏ కేసులు, భూ భారతి దరఖాస్తులు, అసైన్డ్ భూముల సమస్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు.
నేల తల్లిని నమ్ముకున్న అన్నదాత పంట చేతికి వచ్చి అమ్ముకునే వరకు అనేక కష్టనష్టాలను అనుభవిస్తాడు. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురు నిలవలేక కొందరు రైతులు బలవన్మరణాలను ఆహ్వానిస్తారు. మరికొందరు పంట పొలాల్లో పురుగుల మందులు చల్లుతూ అనారోగ్యానికి గురై, పొద్దంతా కష్టపడి అలసటతో ఊపిరి అగి మృత్యు ఒడిలోకి చేరుకుంటున్నారు.
జిల్లాలోని పలు స్కానింగ్ సెంటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రోగులను దోచుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నిర్వాహకులు రిఫరల్ డాక్టర్లకు కమీషన్లు ముట్టజెబుతూ అందినంత దోచేస్తున్నారు. అర్హత లేని వారితో సెంటర్లను నిర్వహిస్తూ రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు.