బీఆర్‌ఎస్ నేతలే టార్గెట్‌గా పోలీసుల అక్రమ కేసులు
ABN, Publish Date - Jul 12 , 2025 | 12:17 AM
మంథని నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకొని పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మండిపడ్డారు. రామగిరి మండలం నాగెపల్లికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణగౌడ్‌ను పోలీసులు ఆరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చిన అనంతరం శుక్రవారం బెయిల్ పై బయటికి రాగా ఆయనతో కలిసి కోర్టులో పుట్ట మఽధు విలేకరులతో మాట్లాడారు.
మంథని, జూలై 11 (ఆంధ్రజ్యోతి): మంథని నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకొని పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మండిపడ్డారు. రామగిరి మండలం నాగెపల్లికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణగౌడ్‌ను పోలీసులు ఆరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చిన అనంతరం శుక్రవారం బెయిల్ పై బయటికి రాగా ఆయనతో కలిసి కోర్టులో పుట్ట మఽధు విలేకరులతో మాట్లాడారు. మంథని ఎమ్మెల్యే, ఆయన సోదరుడి మెప్పు కోసమే పోలీసులు పని చేస్తున్నారని, ఇందు కోసం బీఆర్‌ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు.
ఇప్పటికే నియోజకవర్గానికి చెందిన జక్కు శ్రావణ్, జువ్వాజి తిరుపతితో పాటు తాజాగా పూదరి సత్యనారాయణలపై పోలీసులు కేసులు నమోదు చేసి కోర్టుకు పంపారన్నారు. పోలీసుల తీరు మారకుండా పోలీస్ స్టేషన్లకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల బోర్డులు పెడుతామని హెచ్చరించారు. పూదరి సత్యనారాయణ అరెస్టు విషయంలో మంథని సీఐ, రామగిరి ఎస్‌ఐ, పెద్దపల్లి ఎస్‌ఐలు అత్యుత్సాహం ప్రదర్శించారని దీనిపై ఏసీపీ విచారణ జరిపి వారిని సస్పెండ్ చేయాలన్నారు. మాచీడి రాజుగౌడ్, పూదరి సత్యనారాయణగౌడ్, జక్కు రాకేష్, ఏగోళపు శంకర్‌గౌడ్, కనవేన శ్రీనివాస్, గొబ్బూరి వంశీ, పుప్పాల తిరుపతి, శంకేశి రవీందర్‌లు పాల్గొన్నారు.
Updated Date - Jul 12 , 2025 | 12:13 PM