ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఖనిలో ఘనంగా పోచమ్మ బోనాలు

ABN, Publish Date - Apr 20 , 2025 | 11:40 PM

రేణుక ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం సందర్భంగా మూడు రోజులపాటు నిర్వహించే ఉత్సవాలలో భాగంగా ఆది వారం గౌడ కులస్థుల ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తాలో పోచమ్మ బోనా లను ఘనంగా నిర్వహించారు.

కళ్యాణ్‌నగర్‌, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): రేణుక ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం సందర్భంగా మూడు రోజులపాటు నిర్వహించే ఉత్సవాలలో భాగంగా ఆది వారం గౌడ కులస్థుల ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తాలో పోచమ్మ బోనా లను ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ మేరుగు హన్మంత్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు ఇంటి నుంచి బోనాలు తీసుకువచ్చి పోచ మ్మకు సమర్పించారు. పోతరాజుల నృత్యాలు, డప్పు చప్పుళ్లతో గోదావరిఖని నలుమూలల నుంచి గౌడ కులస్థుల మహిళలు నెత్తిన బోనం పెట్టుకుని పోచ మ్మ ఆలయానికి తరలివచ్చారు. దీంతో పోచమ్మ ఆలయం కిటకటలాడింది. ప్రధాన చౌరస్తా నుంచి లక్ష్మీనగర్‌కు వెళ్లే రోడ్లను ట్రాఫిక్‌ పోలీసులు మూసి వేశారు. వన్‌టౌన్‌ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. నాయకులు బాల సాని స్వామిగౌడ్‌, వంగ శ్రీనివాస్‌, కోడూరి రవి, జనార్దన్‌(లడ్డు), గున్నాల శ్రీధర్‌, పొన్నం అంజయ్య, బూసారపు సంతోష్‌, సురేందర్‌ పాల్గొన్నారు.

గంగారంలో పోచమ్మ బోనాలు

కాల్వశ్రీరాంపూర్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గంగారంలో గీత కార్మికులు ఎల్లమ్మ బోనాల సందర్భంగా ఆదివారం పోచమ్మ బోనాలు నిర్వ హించారు. మహిళలు బోనాలు ఎత్తుకుని ఇంటింటికి కదలివచ్చి డప్పుచప్పు ల్లతో శివసత్తులతో పూనకాలతో పోచమ్మ తల్లికి బోనం సమర్పించారు. గౌడ సంఘం పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2025 | 11:40 PM