పెద్దపల్లి బీజేపీలో ఎవరికి వారే...
ABN, Publish Date - Jul 13 , 2025 | 12:03 AM
పెద్దపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీలో వర్గపోరు రోజురోజుకు తారాస్థాయికి చేరుకుం టోంది. ఒకరిపై నొకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుండడంతో పార్టీ పరువు మంట గలిసే పరిస్థితి ఏర్పడింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వర్గ పోరు ప్రభావాన్ని చూపనున్నాయని పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
పెద్దపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీలో వర్గపోరు రోజురోజుకు తారాస్థాయికి చేరుకుం టోంది. ఒకరిపై నొకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుండడంతో పార్టీ పరువు మంట గలిసే పరిస్థితి ఏర్పడింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వర్గ పోరు ప్రభావాన్ని చూపనున్నాయని పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ వర్గీయుల మధ్య కొంత కాలంగా నెలకొన్న విభేదాలు సద్దుమణగడం లేదు. పలువురు జిల్లా అధ్య క్షులు మారుతున్నా ఆ వర్గాలను ఒక్కటి చేయడంలో విఫలమవుతున్నారు. ఈ నెల 5న పెద్దపల్లి, ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాలతోపాటు పెద్దపల్లి మున్సి పల్ కమిటీలను ఆయా అధ్యక్షులు ప్రకటించడంతో మరోసారి గుజ్జుల, దుగ్యాల వర్గీయుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రెండు వర్గాలు పోటాపోటీగా ప్రెస్ మీట్‌లను ఏర్పాటు చేసి తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించుకున్నారు. విచిత్రమేమిటంటే గుజ్జుల రామకృ ష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్‌లు ఒకరిపై నొకరు ఆరో పణలు, విమర్శలు చేసుకోనప్పటికీ, వారి అనుచరులు మాత్రం తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. సదరు నాయకుల తీరు తెన్నులను వారి వారి అనుచరులు ఎత్తి చూపడాన్ని పార్టీకి చెందిన ఇతర నాయకులు, కార్యకర్తలు ముక్కున వేలేసుకుంటున్నారు. రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతున్నా జిల్లా నాయకత్వం చోద్యం చూస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సొంత పార్టీలా వ్యవహరిస్తున్న దుగ్యాల
మండల కమిటీల ప్రకటన మరుసటి రోజే గుజ్జుల వర్గీయులు, మండల ప్రభారీలు ఆ మరుసటి రోజే ప్రెస్‌మీట్ పెట్టి భగ్గుమన్నారు. బీజేపీ కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు దేశంలో సంఘటన సంరచన ద్వారా మండల కమిటీలను నియమిస్తారని, మండల అధ్య క్షులు, మండల ప్రభారీలు కమిటీని ఏర్పాటు చేసి, దానిని జిల్లా అధ్యక్షుని ఆమోదంతో ప్రకటించాల్సి ఉం టుందని వారు గుర్తు చేశారు. అయితే, దుగ్యాల ప్రదీప్ కుమార్ సొంత పార్టీలా వ్యవహరిస్తూ, నియంతృత్వ ధోరణిలో పెద్దపల్లి నియోజకవర్గంలో తనకు నచ్చిన రీతిలో పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలను నిర్వహిస్తు న్నారని వారు ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వద్ద డబ్బులు తీసుకొని అమ్ముడు పోయారని, 130 గ్రామాలు ఉన్న నియోజకవర్గంలో కేవలం 20 గ్రామాలే పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వ హించారని పేర్కొన్నారు. పార్టీ నూతన అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డిని అడుగడుగునా అడ్డుకుంటున్నారని ప్రభా రీలు మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అల్ఫోర్స్ నరేం దర్‌రెడ్డి వద్ద డబ్బులు తీసుకుని నియోజకవర్గంతో తనకు సంబంధం లేదన్నట్టు ముఖం చాటేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన స్వగ్రా మంలోని బూత్‌లో ఆయనకు 15 ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. అసెంబ్లీ ఎన్నికలైనప్పటి నుంచి కను మరుగైన ప్రదీప్ కుమార్ నియంతృత్వ పోకడలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రదీప్ కుమార్ అనుచరులది దండుపాళ్యం బ్యాచ్ అని విమర్శించారు.
అసమ్మతి కార్యక్రమాలకు గుజ్జుల బ్రాండ్ అంబాసిడర్
దుగ్యాల ప్రదీప్‌కుమార్‌పై గుజ్జుల వర్గీయులు చేసిన ఆరోపణలకు దీటుగా దుగ్యాల వర్గీయులు ఆ మరుసటి రోజే ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి మండిపడ్డారు. 30 ఏళ్లుగా గుజ్జుల రామకృష్ణారెడ్డి పార్టీని తమ వ్యక్తిగత సంస్థగా నడుపుతూ, అసమ్మతి కార్యకలాపాలకు బ్రాండ్ అంబా సిడర్‌గా పేరు తెచ్చుకున్నారని ఆరోపించారు. మాజీ కేంద్ర మంత్రి విద్యాసాగర్ రావును టార్గెట్ చేసి స్వార్థ పూరిత ప్రయోజనాల కోసం బ్లాక్ మెయిల్‌కు పాల్పడి, తర్వాత బండి సంజయ్‌పై కూడా అసమ్మతి రాజకీయా లకు తెర తీసిన గుజ్జుల ఇప్పుడు అదే కుట్ర చేసి పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గీయుల బెది రింపులు, బ్లాక్‌మెయిల్, పెద్దపల్లిలో వ్యాపారులను వేధించారని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి డిపాజిట్ కోల్పోయిన గుజ్జుల రామకృష్ణారెడ్డి, అతని సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థుల గెలుపు కోసం కుమ్మక్కై పెద్దపల్లిలో బీజేపీ పతనానికి కారణ మయ్యారని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఎన్నిక కాకముందు కిరాయి ఇంటిలో ఉన్న ఆయన అనంతరం పెద్ద పెద్ద భవనాలు, భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. మొత్తంగా ఇరువర్గాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తారా స్థాయికి చేరుకోగా, రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకత్వం జోక్యం చేసుకుని ఆయా వర్గాలపై ఎలాంటి క్షమశిక్షణ చర్యలు తీసుకోకపోవడంతో వర్గ పోరు ఆగడం లేదని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. దీని ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడనున్నదని, సత్వరమే రాష్ట్ర, జిల్లా నాయకత్వం జోక్యం చేసుకుని వర్గపోరును ఆపకపోతే పార్టీ భారీ నష్టాన్ని చవిచూడా ల్సి వస్తుందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు.
Updated Date - Jul 13 , 2025 | 12:03 AM