సుందిళ్ళ లీజు భూముల ఎక్స్‌గేషియా చెల్లింపు
ABN, Publish Date - Jul 24 , 2025 | 11:58 PM
సుందిళ్ళలో సింగరేణి మైనింగ్ లీజు భూములకు సంబంధించిన ఎక్స్‌గ్రేషియా చెక్కులను గురువారం ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్ రైతులకు అందజేశారు. ఓసీపీ పనులు చేపడుతున్న సందర్భంగా మంత్రి ఆదేశానుసారం, ఎకరానికి రూ.6.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులను అంద జేశామన్నారు.
గోదావరిఖని, జూలై 24(ఆంధ్రజ్యోతి): సుందిళ్ళలో సింగరేణి మైనింగ్ లీజు భూములకు సంబంధించిన ఎక్స్‌గ్రేషియా చెక్కులను గురువారం ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్ రైతులకు అందజేశారు. జీఎం మాట్లా డుతూ ఓసీపీ-5 పరిధిలోని సింగరేణి మైనింగ్ లీజు భూములలో సుందిళ్ళ రైతులు సింగరేణి భూమిని తాత్కాలికంగా కొంతకాలం జీవనోపాధికి ఉపయోగిం చుకున్నారని, ఇప్పుడు ఆ భూమిలో ఓసీపీ పనులు చేపడుతున్న సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు, కోయ శ్రీహర్ష, సింగరేణి సీఎండీ, డైరెక్టర్(పా) ఆదేశానుసారం, ఎకరానికి రూ.6.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులను అంద జేశామన్నారు. ఈడీసీ కమిటి అధికారులు, ఎస్‌ఓటూ జీఎం ఆంజనేయ ప్రసాద్, ప్రాజెక్ట్ అధికారి డీ రమేష్, డీజీఎం(సర్వే) జీఎల్ రాజు, డీజీఎం(ఫైనాన్స్) ధనలక్ష్మి బాయి, ఎస్టేట్ అధికారి సాంబశివరావు, లా ఆఫీసర్ అఫ్రిన్ సుల్తానా పాల్గొన్నారు.
Updated Date - Jul 24 , 2025 | 11:58 PM