ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలి
ABN, Publish Date - Jun 22 , 2025 | 11:44 PM
ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరుపాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు మేరుగు చంద్రయ్య అన్నారు. ఆదివారం పెద్దంపేట న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఈ నెల 25న వరంగల్‌లో తలపెట్టిన రాష్ట్ర సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించారు.
అంతర్గాం, జూన్ 22(ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరుపాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు మేరుగు చంద్రయ్య అన్నారు. ఆదివారం పెద్దంపేట న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఈ నెల 25న వరంగల్‌లో తలపెట్టిన రాష్ట్ర సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం అటవీ ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దొచిపెట్టేందుకు పూనుకుందని పేర్కొన్నారు. ఆదివాసీ గిరిజన ప్రజలను అటవీ సంపదకు దూరం చేసే చర్యలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపాలని డిమాండ్ చేశారు. కొల్లూరి మల్లేష్, వేల్పుల సాంబయ్య, రాజేశం, శంకర్, రాజ కొమురయ్య, గంగ మల్లయ్య పాల్గొన్నారు.
Updated Date - Jun 22 , 2025 | 11:44 PM