ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలి
ABN, Publish Date - Jun 16 , 2025 | 12:15 AM
ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని వామపక్ష పార్టీల నాయకులు ఐ కృష్ణ, శనిగరపు చంద్రశేఖర్, జూపాక శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం గోదావరిఖని చౌరస్తాలో చలో హైదరాబాద్ మహాధర్నా పోస్టర్లను ఆవిష్కరించారు.
కళ్యాణ్‌నగర్, జూన్ 15(ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని వామపక్ష పార్టీల నాయకులు ఐ కృష్ణ, శనిగరపు చంద్రశేఖర్, జూపాక శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం గోదావరిఖని చౌరస్తాలో చలో హైదరాబాద్ మహాధర్నా పోస్టర్లను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరుతో 2024 నుంచి మావోయిస్టులను అణిచివేత పేరిట కేంద్ర ప్రభు త్వం ఆదివాసీలను, మావోయిస్టులను హత్య చేస్తుందని ఆరోపించారు. 17నెలల కాలంలో దాదాపుగా 540మందిని ఎన్‌కౌంటర్ల పేరిట హత్య చేశారని, ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఖనిజ వనరులను అదాని, అంబానీలకు దోచిపెట్టేందుకు ఈ హత్యాకాండను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శితో సహా 28మందిని గత నెల 21న చంపారని, 1.23లక్షల చెట్లను నరికివేశారని, ఆదివాసీలను అడవుల్లో నుంచి తరిమికొట్టడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. మోదీ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండను నిలిపివేయాలని, మావో యిస్టులతో శాంతిచర్చలను జరుపాలని మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద తలపెట్టిన దర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నరేష్, సత్యనారాయణ, తోకల రమేష్, రామకృష్ణ, రాజేశం, రాజన్న పాల్గొన్నారు.
Updated Date - Jun 16 , 2025 | 12:15 AM