ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పోరాటాల ద్వారానే కార్మికుల హక్కులను కాపాడుకోగలుగుతాం

ABN, Publish Date - May 04 , 2025 | 11:41 PM

సమరశీల పోరాటాల ద్వారానే కార్మిక హక్కులను కాపాడుకోగలుతామని గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం (ఐఎఫ్‌టీయూ)రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఐ కృష్ణ అన్నారు. ఆదివారం ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో రామకృష్ణ అధ్యక్షతన రామగుం డం రీజియన్‌ సమావేశం జరిగింది.

గోదావరిఖని, మే 4(ఆంధ్రజ్యోతి): సమరశీల పోరాటాల ద్వారానే కార్మిక హక్కులను కాపాడుకోగలుతామని గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం (ఐఎఫ్‌టీయూ)రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఐ కృష్ణ అన్నారు. ఆదివారం ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో రామకృష్ణ అధ్యక్షతన రామగుం డం రీజియన్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ సింగరేణి గని కార్మికుల హక్కుల కోసం నిజాయితీగా పోరాటాలు నిర్వ హించిన చరిత్ర జీఎల్‌బీకేఎస్‌కు ఉందని, అనేక ఆటుపోట్లను, ప్రభుత్వ నిర్బంధాన్ని, సింగరేణి యాజమాన్య నిరంకుశ విధానాలను ఎదుర్కొన్న దని, సంఘం నాయకులు రాములు, కుమారస్వామిలతో పాటు ఎంతో మంది కార్మిక నాయకులు అమరులయ్యారు. ఈనెల 20న జరిగే సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలన్నారు. కేంద్రంలో మోదీ, అమిత్‌ షా లు కార్మిక చట్టాలను మార్చి నాలుగు లేబర్‌ కోడ్‌లుగా తీసుకొచ్చి కార్పొ రేట్‌ శక్తులకు కార్మికులను బానిసలుగా చేసే కుట్రలకు ఒడిగట్టిందన్నారు. రామగుండం రీజియన్‌, డివిజన్‌ల కార్యవర్గాలను ఎన్నుకున్నారు.

రామగుండం రీజియన్‌ కమిటీ అధ్యక్షుడిగా బీ అశోక్‌, ఉపాధ్యక్షుడిగా తొట్ల రాయమల్లు, కార్యదర్శిగా ఈదునూరి రామకృష్ణ, సహాయ కార్యదర్శిగా చింతల శేఖర్‌, కోశాధికారిగా గుండేటి మల్లేశం, కార్యవర్గ సభ్యులుగా ఎస్‌ ప్రసాద్‌, ఎన్‌సీ బాబు, పీ మొండయ్య, బీ కిరణ్‌, ఏ చంద్రయ్య, దాసరి నర్సయ్య, కే తిరుపతి, ఎం నారాయణలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఆర్‌జీ-1 డివిజన్‌ కమిటీ అధ్యక్షుడిగా ఎస్‌ ప్రసాద్‌, ఉపాధ్యక్షుడిగా ఎన్‌సీ బాబు, కార్యదర్శిగా చింతల శేఖర్‌, సహాయ కార్యదర్శిగా పీ మొండ య్య, కోశాధికారిగా బీ కిరణ్‌, కార్యవర్గ సభ్యులుగా ఇర్ఫాన్‌, శ్రీకాంత్‌, శ్రీనివాస్‌, రాజకుమార్‌, తిరుపతిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఆర్‌జీ-1, 3 డివిజన్‌ కమిటీ అధ్యక్షుడిగా తొట్ల రాయమల్లు, ఉపాధ్య క్షుడిగా దాసరి నర్సయ్య, కార్యదర్శిగా చంద్రయ్య, సహాయ కార్యదర్శిగా కేతిరుపతి, కోశాధికారిగా నారాయణలను ఎన్నుకొన్నారు. ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు నరేష్‌ జిల్లా నాయకులు దుర్గం పోచయ్య పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2025 | 11:41 PM