ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కాసులు కురిపిస్తున్న ఆయిల్‌పామ్‌ సాగు

ABN, Publish Date - Jul 16 , 2025 | 12:28 AM

విదేశాల నుంచి పామ్‌ ఆయిల్‌ను దిగుమతి చేసుకోకుండా ఉండేందుకు దేశీయంగానే ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో రైతులకు రాయితీలు ఇస్తూ పంట సాగుకు చేస్తున్న ప్రోత్సాహం సత్ఫలితాలను ఇస్తోంది. పెద్దపల్లి జిల్లాలో ప్రయాగాత్మకంగా కొందరి రైతుల భూముల్లో సాగు చేసిన ఆయిల్‌ పామ్‌ పంట చేతికి వచ్చింది.

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

విదేశాల నుంచి పామ్‌ ఆయిల్‌ను దిగుమతి చేసుకోకుండా ఉండేందుకు దేశీయంగానే ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో రైతులకు రాయితీలు ఇస్తూ పంట సాగుకు చేస్తున్న ప్రోత్సాహం సత్ఫలితాలను ఇస్తోంది. పెద్దపల్లి జిల్లాలో ప్రయాగాత్మకంగా కొందరి రైతుల భూముల్లో సాగు చేసిన ఆయిల్‌ పామ్‌ పంట చేతికి వచ్చింది. ఇప్పటి వరకు రెండు కటింగ్‌లు చేపట్టిన రైతులకు ఉద్యాన శాఖాధికారులు సూచించిన మేరకు దిగుబడులు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొదటిసారి ఆయిల్‌ పామ్‌ పంట చేతికి వచ్చింది. టన్నుకు 20 వేల రూపాయల పైచిలుకు ధరకు ఆయిల్‌ పామ్‌ గెలలను రైతులు విక్రయించారు. మూడేళ్లుగా ఉద్యాన, వ్యవసాయ శాఖాధికారులు రైతులను ప్రోత్సహిస్తుండడంతో సాగు విస్తీర్ణం 3,100 ఎకరాలకు చేరింది. జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగును పెంచేందుకు అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

ఎకరానికి రూ.51 వేల సబ్సిడీ..

జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు మూడేళ్ల క్రితం చేపట్టారు. ఎలిగేడు మండలం రెబ్బల్‌దేవ్‌పల్లి వద్ద తిరుమల ఆయిల్‌ కేమ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచింది. రైతులు పంట దిగుబడులను కూడా కంపెనీ కొనుగోలు చేసింది. కాల్వశ్రీరాంపూర్‌ మండలం పెద్దరాతుపల్లి గ్రామ శివారులో ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఆయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కూడా చేపట్టింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ఆయిల్‌ పామ్‌ గెలలను శుద్ధి చేసి ఆయిల్‌గా మార్చి ఆయా ప్రాంతాలకు ఎగుమతి చేయనున్నారు. 2022-23 సంవత్సరంలో ఆయిల్‌ పామ్‌ పంటను సాగు చేయిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 3,100 ఎకరాల్లో రైతులు పంట వేశారు. ఎకరానికి చతురస్రాకారంలో 50 మొక్కలు, త్రిభుజాకారంలో 57 మొక్కలు నాటుతారు. ఒక్కో మొక్కకు రైతులు 20 రూపాయల చొప్పున డీడీ చెల్లిస్తే, ప్రభుత్వం 193 రూపాయల సబ్సిడీ ఇస్తుంది. అలాగే డ్రిప్‌ ఇరిగేషన్‌ కోసం ఎకరానికి 20 నుంచి 27 వేల వరకు సబ్సిడీ ఇస్తుంది. రెండు విడతల్లో పంట కలుపు, ఎరువులు, అంతర పంట కోసం 16,800 రూపాయలు ప్రభుత్వం రైతులకు అందజేస్తుందని అధికారులు తెలిపారు. మూడేళ్ల తర్వాత పంట కాపునకు వస్తుందని ఎకరానికి 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుందని అధికారులు తెలిపారు. తద్వారా ఏడాదికి లక్షా 50 వేల నుంచి 2 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని, నిర్వహణ ఖర్చు 40 వేలు పోతే లక్షకు పైగా ఆదాయం వస్తుంది. పంట కాలం 30 నుంచి 35 ఏళ్ల వరకు ఉంటుంది.

ప్రయోగాత్మకంగా 11.23 ఎకరాల్లో సాగు

జిల్లాలో ప్రయోగాత్మకంగా ఆయిల్‌ పామ్‌ పంటను ఆరుగురు రైతులు 11.23 ఎకరాల్లో సాగు చేశారు. ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్‌ చెందిన నాంసాని సమ్మయ్య 1.73 ఎకరాలు, కళ్యాణపు రాయమల్లు 2.50 ఎకరాలు, మైదంబండకు చెందిన గుజ్జుల రాజిరెడ్డి ఎకరం, కాల్వశ్రీరాంపూర్‌ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన పత్తి శ్రీలత 2.50 ఎకరాలు, ధర్మారం మండలం నర్సింగాపూర్‌ చెందిన బద్దం రాంరెడ్డి 1.50 ఎకరాలు, ఎలిగేడు మండలం శివపల్లికి చెందిన జునేని శ్యామ్‌సుందర్‌ రావు 2 ఎకరాలు, మొత్తం 11.23 ఎకరాల్లో పంట సాగు చేశారు. పంట కాపునకు వచ్చి గెలలు వేస్తున్నది. ఇప్పటి వరకు రెండుసార్లు పంట కోయగా, 18 టన్నుల 35 క్వింటాళ్ల 70 కిలోల వరకు దిగుబడి వచ్చింది. ఈ పంటను టన్నుకు 20,057 నుంచి 20,074 రూపాయల ధర పలికింది. 3 లక్షల 68 వేల 359 రూపాయలు రైతులకు ఆదాయం వచ్చింది. దీంతో పంట సాగు చేసిన రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.

Updated Date - Jul 16 , 2025 | 12:28 AM