ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎల్లంపల్లి భూముల కబ్జాపై కదిలిన అధికారులు

ABN, Publish Date - Jun 05 , 2025 | 12:12 AM

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు భూములను ఆరేళ్లుగా కబ్జా చేసి అక్రమంగా చేపల చెరువులు నిర్మించి చేపల పెంపకం చేపడుతున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో ఎట్టకేలకు జిల్లా అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. 2024 డిసెంబర్‌ 20న ఆంధ్రజ్యోతి జిల్లా ఎడిషన్‌లో ‘ఎల్లంపల్లిలో భూములు కబ్జా’ శీర్షికన అక్రమార్కుల వ్యవహా రాన్ని వెలుగులోకి తీసుకవచ్చిన విషయం తెలి సిందే.

గోదావరిఖని/అంతర్గాం, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు భూములను ఆరేళ్లుగా కబ్జా చేసి అక్రమంగా చేపల చెరువులు నిర్మించి చేపల పెంపకం చేపడుతున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో ఎట్టకేలకు జిల్లా అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. 2024 డిసెంబర్‌ 20న ఆంధ్రజ్యోతి జిల్లా ఎడిషన్‌లో ‘ఎల్లంపల్లిలో భూములు కబ్జా’ శీర్షికన అక్రమార్కుల వ్యవహా రాన్ని వెలుగులోకి తీసుకవచ్చిన విషయం తెలి సిందే. దీనిపై స్పందించిన కలెక్టర్‌ కోయ శ్రీహర్ష రెవెన్యూ, నీటి పారుదల, సర్వే అండ్‌ ల్యాండ్‌ అధికారులచే జాయింట్‌ సర్వేకు ఆదేశించారు. దీంతో నీటి పారుదల శాఖాధికారులు పది రోజుల పాటు సర్వే చేశారు. ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ పరిఽధిలోని పొట్యాల, అకెనపల్లి, ముర్మూర్‌ పరిధిలో రైతులకు చెందిన భూములను లీజుకు తీసుకుని ప్రాజెక్టు బఫర్‌ జోన్‌, ఎఫ్‌టీఎల్‌లోకి అక్రమంగా చొచ్చుకుని వెళ్లి చేపల చెరువులను నిర్మించినట్లుగా గుర్తించారు. అక్రమంగా విద్యుత్‌ను వాడుకోవడంతోపాటు ఎఫ్‌టీ ఎల్‌కు అడ్డుగా కట్టలు వేసి, ప్రాజెక్టులోకి పైపులైన్లు వేసి నీటిని తోడుతున్నట్లు గుర్తించారు. అప్పుడు నామ్‌కే వాస్తేగా వ్యవహరించిన అధికారులు ఇది తమ పని కాదంటే తమది కాదని ఒకరిపై ఒకరు నెట్టేసుకున్నారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోకపోవడంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బుధవారం అదనపు కలెక్టర్‌ డి వేణు, అంతర్గాం తహసీల్దార్‌ తూము రవీందర్‌, నీటి పారుదల శాఖాధికారులు శ్రీపాద ఎల్లంపల్లిని సందర్శించి అక్రమంగా నిర్మించిన చేపల చెరువులను పరిశీలించారు. అనుమతులు లేకుండా చేపల చెరువులను నిర్మించారని, 70 ఎకరాల ప్రాజెక్టు భూములను కబ్జా చేసినట్లుగా సర్వే ద్వారా గుర్తించామని అదనపు కలెక్టర్‌ తెలిపారు. ఆక్రమణలను తొలగించి భూములను స్వాధీనం చేసుకోవాలని నీటి పారుదల శాఖాధికారులను ఆదేశించారు. అలాగే ప్రాజెక్టు నుంచి నీటిని లిఫ్ట్‌ చేస్తున్న మోటార్లను నిలిపి వేయాలని ఎన్‌పీడీసీఎల్‌ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన చేపల చెరువులు నిర్మించిన వారిపై పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని అదనపు కలెక్టర్‌ డి వేణు విలేకరులకు తెలిపారు.

Updated Date - Jun 05 , 2025 | 12:12 AM